Health Tips: వాళ్లలా ఫిట్‌గా ఉండొచ్చు

ఫిట్‌గా, ఆరోగ్యంగా కనిపించే సెలబ్రిటీలను చూసి వాళ్లకేం... వ్యక్తిగత న్యూట్రిషనిస్టులు, ట్రైనర్స్‌ ఉంటారని చెబుతారు. అది నిజమే అయినా... ఆసక్తి, కొన్ని పద్ధతులు పాటిస్తే ప్రత్యేక శిక్షకులు లేకుండానే సాధారణ మహిళలు కూడా స్వయంశక్తితో వీటిని సాధించొచ్చంటున్నారు నిపుణులు.

Updated : 30 May 2023 05:27 IST

ఫిట్‌గా, ఆరోగ్యంగా కనిపించే సెలబ్రిటీలను చూసి వాళ్లకేం... వ్యక్తిగత న్యూట్రిషనిస్టులు, ట్రైనర్స్‌ ఉంటారని చెబుతారు. అది నిజమే అయినా... ఆసక్తి, కొన్ని పద్ధతులు పాటిస్తే ప్రత్యేక శిక్షకులు లేకుండానే సాధారణ మహిళలు కూడా స్వయంశక్తితో వీటిని సాధించొచ్చంటున్నారు నిపుణులు.

ఇంటి పనుల్లో సౌకర్యాలు, డెస్క్‌ జాబ్స్‌ మహిళల్లో అధికబరువు సహా పలురకాల అనారోగ్యాలకు కారణమవుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కండరాల కదలిక తక్కువగా ఉండటంతోపాటు పీచు ఎక్కువగా లేని ఆహారపదార్థాలు శరీరంలో అధిక కొవ్వును పేరుకొనేలా చేస్తాయి. ఆహార నియమాలను పాటిస్తూ.. వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వండి.

మొదటి రోజే జిమ్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌ వంటి కఠిన వ్యాయామాలు చేయనక్కర్లేదు. ఫిట్‌నెస్‌ సాధించాలని గట్టిగా సంకల్పించుకుని ఓ ప్రణాళికతో ప్రారంభించాలి.

మొదటివారం: ఉదయం లేదా సాయంత్రం 15-20 నిమిషాలు నడిచి, పది నిమిషాలు స్కిప్పింగ్‌ చేయాలి. దీంతో కండరాలు కష్టపడటానికి సిద్ధపడతాయి.

రెండో వారం: ఆరుబయట వేగంగా నడవడం, ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్‌లో చూసి జుంబా డ్యాన్స్‌ వంటివి సాధన చేయాలి. క్రమంగా శరీరం ఉత్సాహంగా మారుతుంది.

మూడోవారం: జిమ్‌కెళ్లి ప్రాథమిక దశ వ్యాయామాలను ప్రారంభించాలి.

నాలుగో వారం: ఇప్పటికి శరీరం పూర్తి స్థాయి వ్యాయామాలకు సిద్ధమవుతుంది. 

జిమ్‌లో.. రోజూ ఒకే రకమైనవి చేస్తే బోర్‌ అనిపించొచ్చు. అలా కాకుండా శిక్షకుడి పర్యవేక్షణలో రకరకాల ఎక్సర్‌సైజులను ఎంచుకోవాలి. మరుసటి నెల నుంచి అరగంట సేపు వ్యాయామం చేయడానికి ప్రయత్నించాలి. వారంలో 5 రోజులు వర్కవుట్లు, మిగతా 2 రోజులు యోగా, ధ్యానానికి కేటాయించుకోవాలి. దీంతో శరీరం, మనసు రోజంతా ఉత్సాహంగా ఉంటాయి. చక్కెర, ఉప్పు, మైదాకు దూరంగా ఉంటూ, పీచు, పోషకాలుండే ఆహారంతోపాటు 5, 6 లీటర్ల నీటిని తీసుకుంటే శరీరంలోని వ్యర్థాలు బయటకెళతాయి. కొవ్వు తగ్గుతుంది. కనీసం 7 గంటల నిద్ర తప్పనిసరి. దగ్గర దూరాలకు నడక, లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఎక్కి, దిగడం, ఆఫీస్‌ పని మధ్యలో గంటకొకసారైనా నాలుగడుగులేయడం అలవరుచుకోవాలి. రోజుకి కనీసం 7 నుంచి 8 వేల అడుగులు నియమంగా పెట్టుకొంటే చాలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని