ఒత్తైన జుట్టుకు.. అవిసె గింజల ప్యాక్..!
అధిక బరువును తగ్గించుకోవడానికి అవిసె గింజల్ని ఆహారంలో భాగం చేసుకుంటారు చాలామంది. ఇందులోని ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, అత్యధిక ఫైబర్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు.. ఈ ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు చర్మం, కుదుళ్ల....
అధిక బరువును తగ్గించుకోవడానికి అవిసె గింజల్ని ఆహారంలో భాగం చేసుకుంటారు చాలామంది. ఇందులోని ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, అత్యధిక ఫైబర్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు.. ఈ ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు చర్మం, కుదుళ్ల ఆరోగ్యానికి మేలు చేసే కొలాజెన్ ఉత్పత్తికీ తోడ్పడతాయి. ఈ క్రమంలో జుట్టు, కుదుళ్ల ఆరోగ్యానికి మేలు చేసే ఈ అవిసె గింజల హెయిర్‌ప్యాక్ మీరూ ఓసారి ట్రై చేయండి.
కావాల్సినవి..
⚛ అవిసె గింజలు : ఒక కప్పు
⚛ నీళ్లు : ఆరు కప్పులు
⚛ కొబ్బరి నూనె : ఐదు టీస్పూన్‌లు
తయారీ..
ఒక కప్పు అవిసె గింజలకి ఆరు కప్పుల నీరు చేర్చి బాగా మరిగించాలి. నీళ్లు సగానికి రాగానే స్టౌ మీద నుంచి దించి చల్లారనివ్వాలి. చల్లారినప్పుడు ఆ నీరు జెల్‌లా మారడం గమనించవచ్చు. ఇప్పుడు ఒక పల్చటి శుభ్రమైన క్లాత్ తీసుకొని, జెల్ నుంచి అవిసె గింజలను వడగట్టాలి. ఇలా వడగట్టిన జెల్‌కి ఐదు టీస్పూన్‌ల కొబ్బరి నూనెను చేర్చాలి.
ఎలా వాడాలి..?
హెయిర్ ప్యాక్ వేసుకునే ముందు జుట్టు శుభ్రంగా, పొడిగా ఉండాలి. జుట్టుని సన్నని పాయలుగా విడదీస్తూ, హెయిర్ ప్యాక్ కోసం తయారు చేసుకున్న జెల్‌ని కుదుళ్ల నుంచి వెంట్రుకల చివర్ల వరకు పట్టించాలి. నెమ్మదిగా మునివేళ్లతో ఒక పది నిమిషాల పాటు కుదుళ్లను మసాజ్ చేసి, గంటపాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో జుట్టుని శుభ్రం చేసుకోవాలి.
ఈ హెయిర్ ప్యాక్ జుట్టు పెరగడానికి తోడ్పడటమే కాకుండా హెయిర్ కండిషనర్‌గానూ ఉపయోగపడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.