
Sunburn: ఎండకు చర్మం కందిపోకుండా..!
వేసవి కాలంలో చాలామందికి ఎదురయ్యే సమస్యల్లో చర్మం కందిపోయి నల్లగా మారడం కూడా ఒకటి. మరి, అలా జరగకుండా ఉండడానికే బయటికి వెళ్లేముందు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకుంటాం.. అంటారా..? అయితే సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలతో పోరాడే శక్తి ఈ లోషన్ల కంటే మనం ఆహారంగా తీసుకునే కొన్ని పదార్థాలకే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అందులో ఉండే కొన్ని రకాల పోషకాలు, సమ్మేళనాలే చర్మంపై ఎండ పడినప్పుడు కందిపోకుండా కాపాడతాయట. మరింకెందుకాలస్యం.. ఆ పదార్థాలేంటో మనమూ తెలుసుకొని ఫాలో అయిపోతే సరి..!
ఈ పండ్లు..
ఎండ కారణంగా చర్మం కందిపోకుండా ఉండడానికి పండ్లు ఎంతగానో సహకరిస్తాయి. ముఖ్యంగా దానిమ్మ, స్ట్రాబెర్రీ, జామ.. వంటి పండ్లలో ఉండే పోషకాలు ఇందుకు బాగా దోహదం చేస్తాయి. దానిమ్మలో పుష్కలంగా లభించే ఎల్లాజిక్ ఆమ్లం సూర్యరశ్మి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు మేనుపై పడకుండా అడ్డుకుంటుంది. అలాగే చర్మంలో కొత్త కణాలను ఉత్పత్తి చేసి చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఇక స్ట్రాబెర్రీలో అధికంగా లభించే విటమిన్ సి కూడా ఈ సమస్య దరిచేరకుండా కాపాడుతుంది. అలాగే బ్లూబెర్రీ, రాస్బెర్రీ.. వంటివి కూడా ఎండ నుంచి చర్మాన్ని రక్షించడంలో సమర్థంగా పనిచేస్తాయి. ప్రస్తుతం ఏ కాలంలోనైనా విరివిగా లభించే జామ పండులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఎండ నుంచి చర్మాన్ని రక్షించడంతో పాటు చర్మ క్యాన్సర్, ఇతర మేని సంబంధిత సమస్యలు రాకుండా సంరక్షిస్తాయి. వీటితో పాటు పుచ్చకాయ, కివీ, యాపిల్.. వంటి పండ్లూ చర్మానికి ఎండ నుంచి రక్షణ కల్పిస్తాయి.
గ్రీన్ టీ తాగుతున్నారా?
గ్రీన్ టీ.. అధిక బరువు సమస్యతో బాధపడేవారు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించేవారు ఈ టీ తాగుతుంటారు. ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యం, ఫిట్నెస్పరంగా దోహదం చేయడం మాత్రమే కాదు.. ఎండ నుంచి చర్మానికి తగిన రక్షణ సైతం కల్పిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ట్యానికామ్లం, ఇతర సమ్మేళనాలు ఎండ కారణంగా చర్మం కందిపోకుండా కాపాడతాయి. కాబట్టి ఎవరైతే రోజూ గ్రీన్ టీ తాగుతారో వారికి సన్‌బర్న్ సమస్య చాలా తక్కువగా ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు.
టొమాటోతో టాటా..
మార్చితో మొదలయ్యే ఎండలు దాదాపు జూన్ వరకూ కొనసాగుతాయి. ఈ మూడునాలుగు నెలల పాటు చర్మాన్ని ఎండ నుంచి సంరక్షించుకోవాలంటే కొద్దిగా ఆలివ్ నూనెలో పావు కప్పు టొమాటో పేస్ట్‌ను కలుపుకొని రోజూ తీసుకోవడం వల్ల సూర్యరశ్మి వల్ల చర్మం కందిపోకుండా జాగ్రత్తపడచ్చు. ఎందుకంటే టొమాటోలో ఎక్కువగా లభించే లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ అతినీలలోహిత కిరణాల నుంచి చర్మానికి అధిక సమయం రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు.. ఈ రెండు పదార్థాలూ ఆరోగ్యానికీ ఎంతో మంచివి.
ఆలూతో..
బంగాళాదుంప.. దీంతో చేసిన వంటకాలంటే మనలో చాలామందికి ఇష్టం. అయితే ఇది సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడడంలో బాగా సహకరిస్తుంది. ఇది మేనిమెరుపుకీ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే పిండి పదార్థాలు ఎండ వల్ల చర్మం కందిపోకుండా రక్షిస్తాయి. ఈ క్రమంలో బంగాళాదుంపను మెత్తగా చేసుకొని చర్మంపై ఎండ తగిలే ప్రదేశంలో రాస్తే సరి..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని

Aishwarya Lakshmi: నోరు కట్టేసుకోవద్దు
ఆహారమే నన్ను సినిమాల్లోకి తీసుకొచ్చిందంటే నమ్ముతారా? ఎంబీబీఎస్ తుది పరీక్షలు రాశా. ఇన్నాళ్లు కష్టపడ్డందుకు నాకు నేనే కొంత విరామం ఇచ్చుకోవాలనుకున్నా. ఓ రెస్టారెంట్‌కి వెళితే ఆడిషన్స్ గురించి తెలిసింది. సరదాగా ప్రయత్నించి.. అనుకోకుండా ఎంపికయ్యా. అదీ నా మొదటి సినిమా అనుభవం. పేరొచ్చినా.. నా నటన నాకు నచ్చలేదు.తరువాయి

జిడ్డు తగ్గి చర్మం తెల్లబడాలంటే ఏం చేయాలి?
హాయ్ మేడం. నేను నల్లగా ఉంటాను. కానీ ఏదైనా ఫేషియల్ చేయించుకున్నాక లేదా స్నానం చేశాక చామన ఛాయ రంగులో కనిపిస్తాను. ఆపై మూడు నాలుగ్గంటల తర్వాత మళ్లీ నల్లగా కనిపిస్తాను. ఆకలి వేసినా నా స్కిన్ కలర్ మారిపోతుంటుంది. స్కిన్ వైటెనింగ్ కోసం బీట్రూట్ తింటున్నా. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా?తరువాయి

అలసినా.. అందంగా..
ఎడతెరిపి లేని షూటింగ్‌లతో అలసిపోయుంటానా.. అప్పుడే ముఖ్యమైన వారిని కలవాల్సి ఉంటుంది. లోపలి అలసటను చిరునవ్వుతో కప్పేయొచ్చు. మరి ముఖం? చర్మమేమో నిర్జీవంగా కళ తప్పి కనిపిస్తుంటుంది. మేకప్పైకి మనసు పోదు. అయినా ముఖం తాజాగా, మెరిసేలా కనిపించడానికి ఓ చిట్కా పాటిస్తుంటా. ముఖాన్ని నీళ్లతో కడిగి, తడిలేకుండా తుడవాలి.తరువాయి

మగువ మెడలో మందిరాల శోభ
హారాల్లో ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లను చూస్తూనే ఉన్నాం. అలానే లాకెట్లలోనూ మార్పులు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం మగువల మెడలను అలకరించడానికి తయారైన మందిరాల లాకెట్లు ఆ కోవకు చెందినవే. పాతడిజైన్లకు కొత్త హొయలను అద్దుతూ ఆధ్యాత్మిక చింతనను జోడించి తయారు చేసిన ఈ హారాలను మీరూ ఓసారి చూసేయండి.తరువాయి

మళ్లీ వచ్చెన్ కార్గో ఫ్యాషన్..
కార్గో ప్యాంట్లు అనగానే అవి పాత ఫ్యాషన్ అంటారా.. కాదండోయ్! మళ్లీ కొత్తగా కార్గోల ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు వస్తున్న నయా టాపుల్తో.. వెయిస్ట్కోట్స్, క్రాప్‌టాప్స్, బస్టీర్స్, బ్లేజర్స్ వంటి వాటిపైకి కార్గో ప్యాంట్లు ఆధునిక సొబగులద్దుకొని హల్చల్ చేస్తున్నాయి.తరువాయి

ఆధునిక హంగులతో కొల్హాపుర్..
కొల్హాపురి ఫ్యాషన్లంటేే నచ్చనిదెవరికి చెప్పండి.. అయితే ఇదొకప్పటి ట్రెండ్ అంటారా! కాదండోయ్.. నేటికీ కొల్హాపురి నగలు, చెప్పులు ధరించాలని ఆరాట పడే మహిళలు చాలామందే. అలాంటి వారి కోసమే.. ‘ఐరా సోల్స్’ పేరిట మహారాష్ట్రకి చెందిన ఇమ్రాన్ రిజ్వి కొల్హాపురి బ్రాండ్‌తో ఆధునిక మోడళ్లతో చెప్పులను అందుబాటులోకి తెచ్చారు.తరువాయి

అదిరేటి టాపు మీరేస్తే..
నేటి తరంలో జీన్స్ చూసి మనసు పారేసుకోని అమ్మాయిలుండరు.. ఇది అంతలా నచ్చేస్తుంది మరి. స్కిన్నీ జీన్స్, క్రాప్జీన్స్, సిగరెట్ జీన్స్, వైడ్లెగ్ ఇలా ఎన్ని రకాలో.. అలాగే మిడీస్, జెగ్గింగ్స్, లెగ్గింగ్స్ వీటిలో ఏవి ఎంత ఖరీదుపెట్టి కొన్నా కానీ వాటికి సరైన టాపు ఉండాల్సిందే.తరువాయి

అందమైన చర్మం కావాలంటే.. ఇవి వద్దు!
అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవడానికి ఎలాగైతే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటామో.. అలాగే తీసుకోకూడని ఆహార పదార్థాలు కూడా కొన్ని ఉంటాయి. నవయవ్వనంగా కనిపించాలని; మృదువైన, బిగుతైన చర్మం కావాలని, మేని ఛాయను రెట్టింపు చేసుకోవాలని.. ఇలా అన్ని రకాలుగా అందాన్ని సొంతం చేసుకోవడానికి....తరువాయి

దువ్వేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా?
ఒకప్పుడు శ్రావ్య జుట్టు ఎంత అందంగా, ఒత్తుగా ఉండేదో..! కానీ కొంతకాలం నుంచి జుట్టు బలహీనంగా మారి తెగిపోతోంది.. రాలిపోతోంది.. కారణమేంటా? అని ఆరా తీస్తే అప్పటివరకూ వాళ్ల అమ్మ తనకు దువ్వి జడ వేసేది.. కానీ కాలేజీలో చేరినప్పటి నుంచి జుట్టు దువ్వుకోవడం, జడ వేసుకోవడం...తరువాయి

అండర్ ఆర్మ్స్.. వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పవు!
బయటికి కనిపించే శరీర భాగాలపై పెట్టిన శ్రద్ధ.. దుస్తుల్లోపల దాగుండే భాగాలపై పెట్టం. చంకల విషయంలోనూ ఇలాంటి నిర్లక్ష్యమే చేస్తుంటారు చాలామంది. దీంతో ఆ భాగంలో నల్లగా, గరుకుగా తయారవుతుంది. వేసవిలో చెమట కారణంగా ఈ సమస్య మరింత పెరుగుతుంది. తద్వారా అక్కడ పీహెచ్ స్థాయులు లోపించి.. పలు రకాల ఇన్ఫెక్షన్లు...తరువాయి

Katrina Kaif: నా అందానికి ఇవే కారణం!
అలవాట్లే మన అందాన్ని ప్రతిబింబిస్తాయి. తన విషయంలోనూ ఇది వర్కవుట్ అవుతుందంటోంది బాలీవుడ్ టాల్ బ్యూటీ కత్రినా కైఫ్. ఆరోగ్యకరమైన జీవనశైలికి తోడు సహజసిద్ధమైన చిట్కాలు తన సౌందర్యాన్ని రెట్టింపు చేస్తున్నాయంటోంది. ఈ క్రమంలోనే తాను పాటించే బ్యూటీ సీక్రెట్స్....తరువాయి

అమ్మమ్మల నాటి పద్ధతులతో..
వేసవిలో చెమటతో తలకీ ఇబ్బందులెన్నో. చుండ్రు లాంటి ఎన్నో సమస్యలు చుట్టు ముడతాయి. వీటికి సహజ పద్ధతులతో పరిష్కారం పొందొచ్చంటున్నారు నిపుణులు. అవేంటో చదివేయండి.. కొబ్బరినూనె, నిమ్మరసం సమపాళ్లలో కలిపి మాడుకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత తలను రసాయనాలు తక్కువగా ఉన్న షాంపూతో శుభ్రం చేసుకోవాలి.తరువాయి

లిప్ బామ్ చేసేద్దామా!
అందాన్ని కాపాడుకునే తాపత్రయంతో ఈ మధ్య సౌందర్య ఉత్పత్తులను తెగ వాడేస్తున్నారు. అయితే, వీటిల్లోని హానికారక రసాయనాలు దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. వీటికి బదులు సహజ సౌందర్య ఉత్పతులు వాడాలనుకుంటే... సులువుగా తయారు చేసుకోగలిగిన వాటిల్లో లిప్‌బామ్ ఒకటి.తరువాయి

పట్టు చీరలకో పెట్టె..
పెళ్లి కోసం ప్రత్యేకంగా వేలు ఖర్చు పెట్టి కొన్న పట్టుచీరను కూడా కబోర్డ్‌లో కుక్కేస్తే మడతలు పడి, నాణ్యత దెబ్బతింటుంది కదా.. వాటికి ఏమైనా మరకలు పడితే వాటినంత సులువుగా శుభ్రం చేయలేం. అందుకే మనసుకు నచ్చి కొనుక్కున్న పట్టు చీరలను అపురూపంగా దాచుకునేందుకు వచ్చినవే ఈ శారీబాక్స్లు.తరువాయి

కట్టుకుంటే అదిరేట్టు... పైథానీ పట్టు !
మరాఠీ పెళ్లిళ్లలో సంప్రదాయంగా మెరిసిపోయే పైథానీకి ఇప్పుడు పండగొచ్చింది. ఉత్తరదక్షిణాలు తేడాలేకుండా ఆసేతు హిమాచలం సందడి చేస్తోంది. చీరలతో పాటూ ఆధునిక దుస్తుల డిజైన్లపైనా అందంగా అమరిపోతోంది. చీరలూ, దుపట్టాలూ, బ్లవుజులూ, పిల్లల పట్టు పరికిణీలూ... ఇలా ఒకటేమిటి అన్నీ ఆకట్టుకుంటాన్నాయి.తరువాయి

తేమ తెచ్చే మెరుపు..
మాయిశ్చరైజర్లు, క్రీంలెన్ని రాసినా కొందరి చర్మం మెరవదు. కొన్ని పద్ధతులను పాటిస్తే చర్మాన్ని నిత్యం తాజాగా ఉంచుకోవచ్చు.. 4-2-4 పద్ధతిలో.. క్లెన్సింగ్ చేసేటప్పుడు ముఖానికి నాలుగు నిమిషాలు ఆలివ్ లేదా కొబ్బరి నూనెతో మృదువుగా మర్దనా చేయాలి. ఆ తర్వాత ఆపిల్ సిడార్, వెనిగర్ ఉన్న ఫోమింగ్ క్లెన్సర్‌తో రెండు నిమిషాలు రుద్దాలి.తరువాయి

వేసవిలో సెంటు వాడుతున్నారా?
వేసవిలో చెమట, దుర్వాసన నుంచి తప్పించుకోవడానికి పరిమళద్రవ్యాల్ని ఎక్కువగా వాడేస్తుంటారు. దీర్ఘకాలం ఉపయోగించినా, సరైన దిశలో వినియోగించకపోయినా ఇబ్బందులు తప్పవంటున్నారు సౌందర్య నిపుణులు. అవేంటంటే... డియోడరెంట్లు ఒంటి దుర్వాసనకు కారణమయ్యే చెడు బ్యాక్టీరియాను అడ్డుకుని కొన్ని గంటలపాటు శరీరం నుంచి సువాసనల్ని వెదజల్లుతాయి.తరువాయి

పండగ కళ.. వాళ్లక్కూడా!
పండగనగానే పిల్లలకు లంగా జాకెట్ వేసేస్తాం! ఎప్పుడూ ఒకటే తరహా అంటే వాళ్లకీ బోర్ కొట్టదూ? అందుకోసమే సిద్ధమయ్యాయీ ప్రీ స్టిచ్డ్ చీరలు, ఓణీలు, ధోతీ చీరలు. చిట్టి చిట్టి చీరల్లో అమ్మాయిలు చక్కగా లేరూ! మీరూ మీ చిన్నారికి ప్రయత్నించేయండి. వాళ్లక్కూడా పండగ కళ కొత్తగా తెచ్చేయండి.తరువాయి

అందానికి కొన్ని నియమాలు!
అందంగా, ఆరోగ్యంగా మెరిసే చర్మం కావాలనుకోవడం సహజమే! అందుకు తగ్గ నియమాలు పాటిస్తున్నారా మరి? అవేంటంటే.. ఎండకి వీలైనంత దూరంగా ఉండండి. ఇది చర్మానికి హాని చేయడమే కాదు.. ఇతర సమస్యలనూ కలిగించగలదు. అంతేకాదు.. వృద్ధాప్య ఛాయలకీ ఇదే ప్రధాన కారణం. మరీ అవసరమైతే తప్ప ఎండలోకి వెళ్లకపోవడం మంచిది.తరువాయి

సహజంగా కాపాడదామా!
ఈ కాలం వేడిగాలులు, హానికర యూవీ కిరణాలు చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ట్యాన్, దద్దుర్లు, నిర్జీవంగా తయారవడం వంటివన్నీ వీటి పరిణామాలే! పరిరక్షణ కోసం రసాయనాలతో కూడిన క్రీముల వాడకం ఇంకాస్త చేటు చేయొచ్చు. సహజంగా కాపాడేద్దామా? రెండు స్పూన్ల ఓట్స్‌కి తగినన్ని పాలు కలిపి పేస్ట్‌లా చేయాలి.తరువాయి

మగువకు ముత్యాల గాజుల మురిపెం...
పాల నురగ వన్నెలతో వెలిగిపోయే ముత్యాలను చూసి మనసు పారేసుకోకుండా ఉంటామా చెప్పండి? అందుకే అమ్మాయిల ఓటెప్పుడూ వీటికే. నిన్నటివరకూ హారాల్లో, గొలుసుల్లో ఒదిగిపోయి ఆకట్టుకున్న చిట్టిముత్యాలు...ఇప్పుడు గాజులతో జతకట్టేశాయి. మొఘలాయి వైభవం, రాజస్థానీ శైలి రాజసం...నైజాం నేర్పరితనం ఒంటపట్టించుకుని.తరువాయి

బాబీ పిన్... భలేగా!
పిల్లగాలి తెమ్మరలకు.. అలల్లా తేలాడే కురులు ముఖారవిందాన్ని రెట్టింపు చేస్తాయనడంలో సందేహమే లేదు. అందుకే.. ఎప్పటికప్పుడు తలకట్టు తీరుని కొత్తగా కనిపించేలా చేయడానికి హెయిర్ యాక్సెసరీలెన్నెన్నో వచ్చాయి. అయితే పాతతరంలో అమ్మమ్మ, అమ్మలు... నున్నగా తల దువ్వినాసరే, జుట్టుని నొక్కి ఉంచడానికి వాడిన చెంప పిన్నులకు ఇప్పటికీ హవా తగ్గలేదంటే నమ్మండి.తరువాయి

జుట్టు సమస్యలకు చెక్ పెట్టే మసాజ్!
విపరీతంగా జుట్టు రాలుతోందా? ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పదే పదే వెంట్రుకలు పొడిబారిపోతున్నాయా? వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా చుండ్రు సమస్య వేధిస్తోందా? అయితే ఇలాంటి కేశ సౌందర్య సమస్యలన్నింటికీ చెక్ పెట్టే అద్భుత సాధనం మసాజ్ అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వారానికోసారి హెయిర్ మసాజ్....తరువాయి

ఇంతకీ వాటిని మార్చారా..?
ఏ క్రీమ్.. కాలమేదైనా ఒకటే క్రీమ్ అన్న ధోరణి వద్దు. చలికాలంలో కాస్త ఎక్కువ తేమనిచ్చే క్రీములు వాడతాం. వాటినే వేసవిలోనూ ఉపయోగిస్తామంటేనే సమస్య! ముఖం జిడ్డు పట్టడమే కాదు.. చిరాకుగానూ తోస్తుంది. కాబట్టి, హైలురోనిక్ యాసిడ్, నీటి ఆధారిత క్రీములను ఎంచుకోండి. ఇవి చర్మంలోకి తేలిగ్గా ఇంకడమే కాదు.. జిడ్డు భావననీ కలిగించవు.తరువాయి

పాత వాటికి.. కొత్త లుక్!
బీరువాలో ఎన్ని డ్రెస్సులు ఉన్నా... అమ్మాయిల నుంచి వచ్చే మాట... మా దగ్గర సరైన దుస్తులు లేవనే. ముఖ్యంగా కాలేజీలకు వెళ్లేవారు నెలకోసారైనా ఈ మాట అంటారు. మరి ఇవన్నీ ఏంటని ప్రశ్నిస్తే వేసేసుకున్నాంగా... మా స్నేహితులు చూసేశారు మమ్మీ అంటూ సమాధానమిస్తారు. భలే చిత్రమైన పరిస్థితి కదూ! అందుకే రోజువారీ వేసుకునే బ్లౌజులు, షర్ట్స్, టాప్స్, త్రీబైఫోర్త్స్కి కొత్త లుక్ ఇచ్చేయండి.తరువాయి

మహారాణి మెరుపులు
పెళ్లిళ్లు,పూజలు లాంటి ప్రత్యేక సందర్భాల్లో అందరి కంటే ప్రత్యేకంగా కనిపించాలని, మహారాణిలా వెలిగిపోవాలని ఉందా?! కానీ సాధ్యం కాదులెమ్మని సరిపెట్టుకుంటున్నారా? మరేం ఫరవాలేదు.. బ్రహ్మాండంగా కుదురుతుంది. అందుకు వేలూ లక్షలూ ఖర్చుపెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈ రాజస్థానీ హారాలు ధరిస్తే చాలు.. రాణిగారి దర్జా, దర్పం ఇట్టే వచ్చేస్తాయి.తరువాయి

బుట్టబొమ్మలా నర్తించే నగలు!
‘కాదేదీ కళకనర్హం’ అన్నట్లు.. ఈ కాలపు అమ్మాయిల అభిరుచుల్ని ఆకళింపు చేసుకొని విభిన్న రకాలైన నగలు/యాక్సెసరీస్‌ని రూపొందిస్తున్నారు డిజైనర్లు. ఇలా ప్రత్యేకమైన థీమ్స్‌తో రూపొందించిన ఆయా నగలు కూడా అతివల మనసు దోచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే డ్యాన్సింగ్ థీమ్‌తో రూపొందించిన ఆభరణాలూ మగువల్ని....తరువాయి

నెయిల్ఆర్ట్ ఎక్కువ రోజులు ఉండాలంటే..!
పండగలు, శుభకార్యాలు, ప్రత్యేక సందర్భాలప్పుడు కూడా మామూలుగానే ముస్తాబైతే ఏం బాగుంటుంది? అందుకే కదా.. అలాంటప్పుడు చాలా స్పెషల్‌గా కనిపించాలని అదిరిపోయే డ్రస్సు, మ్యాచింగ్ యాక్సెసరీస్, స్పెషల్ నెయిల్ ఆర్ట్.. మొదలైనవి ఎంచుకునేది అంటారా? అయితే వీటిలో మీరు ఎంతో స్పెషల్‌గా వేసుకునే.....తరువాయి

అలా మేకప్ చేయకూడదు!
మెరిసిపోవాల్సిన సందర్భమేదైనా కాస్త మేకప్ టచ్ ఇస్తుండటం మనకు అలవాటే! అయితే తెలియక చేసే చిన్న పొరపాట్లు చర్మ సమస్యలకు దారి తీయొచ్చని తెలుసా? తెలియకో, సమయం లేదనో, ఒక్కరోజుకి ఏమవుతుందిలే అనో మాయిశ్చరైజర్ రాయడం మానేస్తున్నారా? సరైన లుక్ రాకపోవడమే కాదు చర్మంపై దురదలకూ కారణం అవుతుంది.తరువాయి

Beauty Gadget: బన్ని ‘స్టైల్’గా బంధించేద్దాం!
ముందుంది వేసవి కాలం.. జుట్టును విరబోసుకోవడం కంటే.. కొప్పు వేసుకోవడానికే చాలామంది అమ్మాయిలు ఇష్టపడుతుంటారు. మరి, దాన్ని అలాగే వదిలేయకుండా.. స్టైలిష్‌గా హంగులద్దాలనుకుంటే.. ప్రస్తుతం మార్కెట్లో బోలెడన్ని బన్ యాక్సెసరీస్ దొరుకుతున్నాయి. ‘స్టిక్ బన్ పిన్’ కూడా.....తరువాయి

వెండి, బంగారం... వన్నెలివి!
వేడుకైనా, పండగైనా...మోము మెరిసిపోవాలంటే మెడలో నగ ఉండాల్సిందే. అచ్చంగా బంగారంతోనో, ఆక్సిడైజ్డ్ సిల్వర్తోనో చేయించుకున్న హారాన్నో, నెక్లెస్‌నో మ్యాచింగ్ వేసుకుంటే చాల్లే అనుకుంటున్నారా? అయితే, అలా ఒకే రకమైన లోహంతో తయారు చేసినవి ఎంచుకోవడం నిన్నటి ట్రెండ్ అంటోంది నేటితరం.తరువాయి

టెన్షన్ పడితే అందం తగ్గిపోతుందట..!
ఈ రోజుల్లో వ్యక్తిగతంగానైనా, వృత్తిపరంగానైనా ఒత్తిడి, ఆందోళనలతో సావాసం చేయక తప్పట్లేదు. ఎంత వద్దనుకున్నా.. ఏదో ఒక రూపంలో ఈ మానసిక సమస్యలు మనల్ని కుంగదీస్తున్నాయి. తద్వారా వివిధ రకాల అనారోగ్యాలు చుట్టుముడుతున్నాయి. అయితే ఇలాంటి ఒత్తిళ్లు మన అందాన్నీ దెబ్బతీస్తాయని....తరువాయి

పెళ్లికి ముందు.. ఈ పొరపాట్లు వద్దు..!
పెళ్లంటే చాలు.. ఎంచుకునే దుస్తుల దగ్గర్నుంచి యాక్సెసరీస్ దాకా ప్రతిదీ అందరికంటే భిన్నంగా, సరికొత్తగా ఉండాలని అనుకోవడం సహజం. ఇక అందం విషయంలో అయితే ఏమాత్రం రాజీపడే సమస్యే లేదంటున్నారు ఈ తరం అమ్మాయిలు! ఈ క్రమంలోనే పెళ్లికి ముందు బోలెడంత డబ్బు ఖర్చు పెట్టి....తరువాయి

జుట్టు చాలా పల్చగా ఉంది.. పెరగాలంటే ఏం చేయాలి?
మేడమ్.. నా వయసు 21 సంవత్సరాలు. నేను నాలుగేళ్ల క్రితం రక్తహీనతతో బాధపడ్డాను. ఆ సమయంలో జుట్టు రాలిపోయి పల్చగా మారింది. దానివల్ల మా ఇంట్లో వాళ్లు నాకు గుండు చేయించారు. అయినా నా జుట్టు ఆరోగ్యంగా పెరగలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే శరీరంలో రక్తం తక్కువగా....తరువాయి

ఈ జాగ్రత్తలతో.. జుట్టు ఒత్తుగా..!
నల్లటి వాలు కురులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కాకపోతే ప్రస్తుతం రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం, మారుతున్న జీవన విధానం కురుల మీద కూడా ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే జుట్టు వూడిపోవడం, పలుచగా అయిపోవడం.. వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికి తోడు మనం స్త్టెలింగ్ కోసం.....తరువాయి

అందానికి... ఆవిరి మంత్రం!
ముఖం అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు. ఇందుకోసం మనకు తెలిసిన అన్ని బ్యూటీ టెక్నిక్లూ పాటించేస్తాం. వాటన్నింటినీ పక్కన ఉంచి ఈసారి ఆవిరి పట్టి చూడండి. కచ్చితంగా మీ మోము మెరిసిపోతుంది. చర్మం లోపలి పొరల్లో పేరుకున్న దుమ్మూ, ధూళీ, ఇతర మలినాలను శుభ్రపరచడానికి ఆవిరి ఉపయోగపడుతుంది.తరువాయి

మెనోపాజ్ దశలో అందాన్ని సంరక్షించుకోండిలా!
వేడి ఆవిర్లు, ఇర్రెగ్యులర్ పిరియడ్స్, మూడ్ స్వింగ్స్, బరువు పెరగడం.. ఇలా చెప్పుకుంటూ పోతే మెనోపాజ్ దశలో మహిళలకు కంటి మీద కునుకు లేకుండా చేసే సమస్యలెన్నో! కేవలం ఆరోగ్యపరంగానే కాదు.. అతివల సౌందర్యాన్ని కూడా దెబ్బతీస్తుందీ దశ. చర్మం పొడిబారడం, మొటిమలు-మచ్చలు ఏర్పడడం....తరువాయి

అందానికి మీనాకారి!
మీనూ అంటే పర్షియన్ భాషలో స్వర్గం అని అర్థం. మీనాకారి అంటే నేరుగా స్వర్గం నుంచి దిగివచ్చిన అందం అని అర్థం. నీలిరంగుని ప్రత్యేక పద్ధతిలో నగలపై అద్దే ఈ కళ మొగలుల ద్వారా ప్రాచుర్యంలోకి రావడంతో... మొగల్ మీనాకారి అయ్యింది. ప్రస్తుతం ఈ మొగల్మీనాకారి పనితనంతో చేసిన గాజులు, నగలు ట్రెండుగా మారాయి.తరువాయి

రంగు వేసే ముందు...
ఈ రోజుల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ జుట్టుకి రంగు వేసేవాళ్లే. కొందరు ట్రెండ్ అంటే, మరికొందరు తెల్లబడిన వెంట్రుకలు నల్లగా కనిపించేందుకు... అయితే ఎలా వేసుకున్నా... ఈ నియమాలు మరిచిపోవద్దు. రంగు కొనేటప్పుడే అమ్మోనియా, సల్ఫేట్ ఫ్రీ, కలర్ సేఫ్ రకాలను కొనడం వల్ల... ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు.తరువాయి

స్కిన్ బ్రషింగ్ వల్ల ఎన్ని ప్రయోజనాలో..!
స్కిన్ బ్రషింగ్.. చర్మం మీద పేరుకుపోయిన మృతకణాలను తొలగిస్తూ నిగారింపు తీసుకొచ్చే వాటిలో ఇది కూడా ఒక పద్ధతి. మెత్తని బ్రిసిల్స్ ఉన్న బ్రష్ లేదా స్పాంజిని ఉపయోగించి చర్మాన్ని శుభ్రపరిచే ఈ ప్రక్రియ వల్ల కేవలం సౌందర్యపరంగానే కాదు.. ఆరోగ్యపరంగా కూడా ఎన్నో....తరువాయి

చాక్లెట్ మసాజ్‌తో మెరిసే చర్మం..!
చర్మం ప్రకాశవంతంగా మెరవాలన్నా, నిర్జీవమైపోయిన చర్మాన్ని తిరిగి పునరుత్తేజితం చేయాలన్నా అది శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగడం వల్లనే సాధ్యమవుతుంది. అందుకు చాక్లెట్ మసాజ్ చక్కగా తోడ్పడుతుంది. స్పా ట్రీట్మెంట్లలో భాగంగా చేసే ఈ మసాజ్‌లో డార్క్ చాక్లెట్‌తో పాటు ఏదో ఒక అత్యవసర నూనెని.....తరువాయి

Nail Art Trends: గోళ్లకు ‘కొత్త’ సొగసులు!
సౌందర్య పోషణలో భాగంగా గోళ్ల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిందే. ఈ క్రమంలో మానిక్యూర్, ట్రిమ్మింగ్ వంటి ప్రక్రియలతో వాటి అందాన్ని కాపాడుకోవడమే కాదు.. నెయిల్ ఆర్ట్తోనూ వాటికి కొంగొత్త సొగసులద్దుతుంటాం. దీనికి సంబంధించి ఈ ఏడాది సరికొత్త ట్రెండ్స్....తరువాయి

Makeup Removal: ఏం చేయాలి? ఏం చేయకూడదు?!
మేకప్ అంటే అమ్మాయిలకు ఎంతిష్టమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కేవలం మక్కువతోనే కాదు.. వృత్తిలో భాగంగానూ కొంతమంది తరచూ మేకప్ వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలా వేసుకోవడంతోనే సరిపోదు.. దాన్ని తొలగించుకునే క్రమంలోనూ కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలంటున్నారు....తరువాయి

బ్యాగోగులు చూడండి!
బ్యాగ్‌ని కొనేటప్పుడే స్పష్టత ఉండాలి. ఎందుకంటే... అన్ని అవసరాలకూ ఒకటే బ్యాగుని వాడితే సౌకర్యమూ ఉండదు. స్టైల్‌గానూ అనిపించదు. అవసరానికి తగ్గట్టు రెండు మూడు రకాలను కొనిపెట్టుకోవాలి. ఆఫీసుకి ఒకరకమైనవి, పార్టీలకు మరో తరహా... ఇలా సందర్భానికి అనువైనవి మార్కెట్లో ఎన్నో రకాలున్నాయి.తరువాయి

రింగుల జుట్టును కాపాడుకోవాలంటే..!
జుట్టు తేమను కోల్పోవడానికి, నిర్జీవమైపోవడానికి వాతావరణం కూడా ఓ కారణమే. ప్రత్యేకించి శీతాకాలంలో వీచే చల్లగాలులు, మంచు వల్ల జుట్టు తేమను కోల్పోతుంది. అదే కర్లీ హెయిర్ అయితే మరిన్ని సమస్యలు..! ఈ క్రమంలో బయటకు వెళ్లేటప్పుడు జుట్టును కవర్ చేసుకునేలా క్యాప్ ధరించడం, స్కార్ఫ్....తరువాయి

మడమలు పగులుతున్నాయా.. మాస్క్ వేయండిలా..!
ముందుగా ఒక టబ్‌లో కొద్దిగా గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో పైన చెప్పినవన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఆ నీటిలో పాదాలను 10 నుంచి 15 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత స్క్రబ్ చేసి మృతకణాలను తొలగించుకోవాలి. ఇప్పుడు కాస్త గ్లిజరిన్‌లో ఒక్కో టీస్పూన్ చొప్పున నిమ్మరసం, రోజ్‌వాటర్....తరువాయి

అమ్మ చెప్పిన చిట్కాలతోనే అందాన్ని కాపాడుకుంటున్నా..!
తెర వెనుక ఎలా ఉన్నా.. తెరపై అందంగా, పాత్రకు అనుగుణంగా కనిపించడానికి చాలామంది సినీ తారలు మేకప్‌ను ఆశ్రయిస్తారన్న విషయం తెలిసిందే! అయితే ఈ ఉత్పత్తుల్లోని రసాయనాలు, ఇతర పదార్థాలు చర్మానికి హాని కలిగించి.. సహజ అందాన్ని దెబ్బతీస్తాయి. అందుకే తెర వెనుక చర్మ సౌందర్యానికి అధిక....తరువాయి

నిగనిగలాడే కురుల కోసం..!
నిగనిగలాడే నల్లటి వాలు కురులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ రోజుల్లో ఆహారపు అలవాట్లతో పాటు మారుతోన్న జీవనశైలి ప్రభావం కురులపై కూడా పడుతోంది. వీటికి తోడు స్త్టెలింగ్ కోసం ఉపయోగించే ఉత్పత్తులు కేశాలను నిర్జీవంగా మార్చేస్తున్నాయి. దీనికి పరిష్కారంగా ఇంట్లోనే సులభంగా.....తరువాయి

వేడుకల్లో స్నీకర్స్..
శీత కాలం సాయం వేళలంటేనే సెలబ్రేషన్ సమయాలు. నూతన సంవత్సర వేడుకలకు ముందు స్నేహితులతో టీ పార్టీలు, మైదానాల్లో ఆటలు వంటి సంతోష సమయాల్లో దుస్తులతోపాటు స్నీకర్స్ కూడా ప్రత్యేక అందాన్నితెస్తాయంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. ఏయే సమయాల్లో ఎటువంటి వస్త్రశ్రేణికి ఇవి నప్పుతాయో సూచిస్తున్నారు... చూడండి..తరువాయి

అందాన్ని.. అలవాటు చేసుకోండి!
కొందరు ఎప్పుడూ కెమెరా రెడీగా ఉంటారు. మేమూ బోలెడు క్రీములు రాస్తున్నాం అయినా ఏదో లోటే! వీళ్లకు మాత్రం అంతటి అందం ఎలా సాధ్యం.. అనిపిస్తుంటుంది కదా! ఈ చిన్ని అలవాట్లను చేసుకోండి.. మీరూ ఆ జాబితాలో చేరిపోవచ్చు. చర్మంపైకి చేరిన దుమ్ము కళా విహీనంగా కనిపించేలా చేయడమే కాదు..తరువాయి

Wedding Season: ఆ సమస్యకు చెక్ పెట్టాలంటే!
అసలే పెళ్లిళ్ల సీజన్.. సాధారణంగానే అందంగా మెరిసిపోవాలనుకునే అమ్మాయిలు ఈ సీజన్లో ప్రత్యేకంగా ఈ విషయంలో మరింత శ్రద్ధ వహిస్తుంటారు.. కానీ చాలామందికి నిద్రలేమి, సరైన ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల ముఖం ఉబ్బిపోవడం ఓ పెద్ద సవాలుగా మారుతుంది. మరి, ఈ సమస్యకు కొన్ని సహజసిద్ధమైన....తరువాయి

తేలికగా మెరిపించే.. జె-బ్యూటీ!
చర్మ సంరక్షణకు ప్రాధాన్యమిచ్చే ప్రతి అమ్మాయి.. స్కిన్ కేర్ రొటీన్ పాటించాల్సిందే. ఈ విషయంలో ఒక్కొక్కరూ ఒక్కో సలహా ఇస్తారు. దాంతో వాడే ఉత్పత్తులు పెరిగి పోతాయి. కాలంతో పరుగులు పెట్టే ఈ తరానికి అంత సమయమెక్కడిది? అదే సింపుల్‌గా అయిపోయే మార్గముంటే? అలా ఆలోచించే వారికి ‘జె-బ్యూటీ’ సరైన మార్గం.తరువాయి

లెన్స్ పెట్టుకున్నప్పుడు మేకప్ ఎలా?
ఫ్యాషన్ పేరుతోనో.. లేక సౌందర్య సృహతోనో.. ఏదో ఒక కారణంతో కాంటాక్ట్ లెన్స్‌లను ఉపయోగించడం ఇప్పుడు కామనైపోయింది. మామూలుగానే మేకప్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి, కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునేవాళ్లు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అందుకే మేకప్ వేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు....తరువాయి

చెక్కిళ్లలో పేరుకున్న కొవ్వు కరగాలంటే..
చెక్కిళ్లు లావుగా ఉంటే.. కిందికి వేలాడి వయసు పైబడినట్లుగా, అందవిహీనంగా కనిపిస్తాయి. దీనికి కారణం చెక్కిళ్లలో పేరుకుపోయిన అనవసర కొవ్వులే! దీన్ని వీలైనంత త్వరగా తగ్గించుకుంటేనే ముఖం అందాన్ని తిరిగి పొందగలుగుతాం. ఈ క్రమంలో చెక్కిళ్లలో పేరుకుపోయిన కొవ్వును....తరువాయి

చుండ్రును తగ్గించే హెయిర్ ప్యాక్స్!
సీజన్ ఏదైనా సరే.. సౌందర్యపరంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తడం సహజమే! అవి కేవలం చర్మ సంబంధితమైనవే కాదు.. కేశాలకు చెందినవి కూడా కావచ్చు. ఈ తరహా సమస్యలన్నింట్లోనూ చుండ్రు బాగా ముఖ్యమైంది. వాతావరణంలో కలిగే మార్పులు, మన శరీరంలో హార్మోన్ల స్థాయుల్లో జరిగే మార్పులు, జుట్టును సరిగ్గా....తరువాయి

బంగారంలాంటి మోము కోసం...
ముఖాన్ని ముందుగా శుభ్రం చేసుకోవాలి. లేదంటే చర్మ రంధ్రాల్లోని మురికితో నూనెలు, బాక్టీరియా వంటివి కలిసి మొటిమలు, మచ్చలకు కారణమవుతాయి. మృదువైన క్లెన్సర్‌తో శుభ్రం చేసి, 5-10 నిమిషాలు ముఖానికి ఆవిరిపట్టాలి. దాంతో చర్మ రంధ్రాలు తెరుచుకొని వ్యర్థాలు, అదనపు నూనె వంటి మలినాలన్నీ బయటకొచ్చి, రక్తప్రసరణ బాగా జరుగు తుంది.తరువాయి

బ్లవుజుకే నగ!
వేడుకలేవైనా దుస్తులు, నగలపైనే చర్చంతా! ప్రతిదాని మీదకీ నగంటే కష్టం. అలాగని ప్రత్యేకంగా కనిపించకపోతే ఎలా? మన మనసులోని చింత డిజైనర్లూ అర్థం చేసుకున్నారు. అందుకే బ్లవుజులకు అచ్చంగా నగల్లా కనిపించేలా ఎంబ్రాయిడరీ చేశారు. నెక్లెస్, చోకర్, హారం.. ప్రతిదీ జాకెట్లపై తళుక్కుమంటున్నాయిలా. బంగారమే కాదండోయ్.. రాళ్లు, వజ్రాల నగల్లా కనిపించేలానూ రూపొందించేస్తున్నారు.తరువాయి

జీన్స్ కొంటున్నారా...
మల్టీ టాస్కింగ్ అంటే ముందడుగు వేసే అలవాటున్న వారికి స్కిన్నీ జీన్స్ సరిగ్గా నప్పుతుంది. నిత్యం ఉత్సాహవంతమైన జీవనశైలి ఉన్నవారి వార్డ్‌రోబ్‌లో ఈ జీన్స్ ఉండాల్సిందే. మృదువుగా, సాగే గుణంతో ఈ డెనిమ్ ఫ్యాబ్రిక్ సౌకర్యవంతంగా ఉంటుంది. జతగా టాప్స్, స్కర్టు, కుర్తీలు బాగుంటాయి.తరువాయి