పాలిచ్చే తల్లులు వీటికి దూరంగా..!
పుట్టిన బిడ్డకు తల్లిపాలను మించిన పోషకాహారం మరొకటి లేదని మనందరికీ తెలుసు. అందుకే అమ్మపాలను అమృతధారలు అని కూడా అంటారు. అయితే పిల్లలకు పాలిచ్చే తల్లులు తీసుకునే ఆహారం విషయంలో కాస్త జాగ్రత్త వహించడం తప్పనిసరి. ఎందుకంటే తల్లి తీసుకునే ఆహార ప్రభావం బిడ్డ మీద తప్పకుండా ఉంటుంది.
పుట్టిన బిడ్డకు తల్లిపాలను మించిన పోషకాహారం మరొకటి లేదని మనందరికీ తెలుసు. అందుకే అమ్మపాలను అమృతధారలు అని కూడా అంటారు. అయితే పిల్లలకు పాలిచ్చే తల్లులు తీసుకునే ఆహారం విషయంలో కాస్త జాగ్రత్త వహించడం తప్పనిసరి. ఎందుకంటే తల్లి తీసుకునే ఆహార ప్రభావం బిడ్డ మీద తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఆహారం తీసుకునే క్రమంలో పాలిచ్చే తల్లులు కొన్ని పదార్థాలకు దూరంగా ఉంటేనే శ్రేయస్కరం. మరి, ఆ పదార్థాలేంటో మనమూ ఓసారి తెలుసుకుందాం రండి..!
సాధారణంగా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లి తీసుకునే ఆహారం మీదే పాల ఉత్పత్తి కూడా ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని ఆహారపదార్థాలు పాల ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడితే మరికొన్ని తగ్గిస్తాయి. అలాగే తల్లి తీసుకునే ఆహారపదార్థాల ప్రభావం బిడ్డ మీద తప్పకుండా కనిపిస్తుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి పాలిచ్చే తల్లులు వీటికి దూరంగా ఉంటే తల్లీబిడ్డలిద్దరికీ క్షేమం..
కెఫీన్ సంబంధిత పదార్థాలు..
మీకు కాఫీ తాగే అలవాటు ఉందా? రోజుకి రెండుసార్లు కాఫీ తాగితే ఫర్వాలేదు. కానీ అంతకంటే ఎక్కువగా తీసుకునే అలవాటు మీకుంటే వెంటనే దానికి స్వస్తి పలకాలి. ఎందుకంటే కాఫీలో ఉండే కెఫీన్‌ని పెద్దలు అరిగించుకున్నంత సులభంగా పిల్లలు అరిగించుకోలేరు. దాని వల్ల పిల్లలు రాత్రి సమయంలో సరిగా నిద్రపోకపోవడం, చికాకుగా ప్రవర్తించడం వంటివి చేస్తారు. కాబట్టి కాఫీకి మాత్రమే కాదు.. కెఫీన్ సంబంధిత పదార్థాలన్నింటికీ దూరంగా ఉండటమే మంచిది.
చాక్లెట్లు..
చాక్లెట్లలో కూడా ఎంతోకొంత కెఫీన్ ఉంటుంది. అలాగే తల్లి చాక్లెట్ తిన్న తర్వాత బిడ్డకి పాలు పడితే ఆ కెఫీన్ ప్రభావం వల్ల కడుపునొప్పి వచ్చే అవకాశం లేకపోలేదు. లేదా కడుపులో గ్యాస్ ఏర్పడి బిడ్డని ఇబ్బందిపెట్టవచ్చు. కాబట్టి చాక్లెట్స్కు ఎంత దూరంగా ఉంటే అంత శ్రేయస్కరం. ఒకవేళ చాక్లెట్లంటే బాగా ఇష్టం ఉండి తినాలనిపించినప్పుడు పాలతో తయారయ్యే చాక్లెట్స్ని తినవచ్చు. అయితే వీటిని కూడా ఎంత మితంగా తీసుకుంటే అంత మంచిదని గుర్తుంచుకోవాలి సుమా!
మసాలా దినుసులు..
దాల్చినచెక్క, వెల్లుల్లి.. మొదలైన మసాలా దినుసులతో పాటు మిరియాలకు కూడా పాలిచ్చే తల్లులు దూరంగా ఉండాలి. ఎందుకంటే బిడ్డ జీర్ణవ్యవస్థ అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి మసాలాదినుసుల ప్రభావాన్ని తట్టుకుని జీర్ణించుకోవడం పిల్లలకు కష్టంగా ఉంటుంది. ఫలితంగా వారికి కడుపులో నొప్పి రావడం, గ్యాస్ ఏర్పడటం.. వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాగే తల్లి తీసుకునే ఆహారంలో వెల్లుల్లి మరీ ఎక్కువైతే బిడ్డ తాగే పాలు కూడా వెల్లుల్లి వాసన వస్తాయి. దీంతో బిడ్డ పాలు తాగడానికి సుముఖత చూపించలేక, ఆకలితో ఏడ్చే అవకాశం ఉంటుంది.
పుదీనా: అలాగే పుదీనా ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల తల్లిలో పాల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. అందుకే పాలిచ్చే తల్లులు పుదీనాకు దూరంగా ఉండడం మంచిది.
ఈ కాయగూరలు కూడా..
ఉల్లిపాయలు, బ్రకలీ, క్యాలీఫ్లవర్, క్యాబేజ్, దోసకాయ.. మొదలైన పదార్థాలకు కూడా పాలిచ్చే తల్లులు దూరంగా ఉండాలి. వీటిని అధికమొత్తంలో తీసుకోవడం వల్ల బిడ్డ కడుపులో గ్యాస్ ఏర్పడి కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని డైట్ లిస్ట్‌లో ఎంత తక్కువగా వీలైతే అంత తక్కువగా చేర్చుకోవాలి.
ఇవేకాదు.. నిమ్మజాతికి చెందిన రకరకాల పండ్లు, పైనాపిల్, కివీ, స్ట్రాబెర్రీ.. మొదలైన పండ్లను ఆహారంగా తీసుకోకూడదు. పాదరసం ఎక్కువగా లభించే చేపలు కూడా తినకూడదు. వీటితో పాటు కుటుంబంలో వంశపారంపర్యంగా ఎవరికైనా, ఏవైనా ఫుడ్ అలర్జీలు ఉంటే వాటికి సంబంధించిన ఆహారపదార్థాలు తిన్నప్పుడు కూడా బిడ్డని ఓ కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. బిడ్డకు సంబంధించి కడుపునొప్పి, విపరీతంగా ఏడవడం, ముఖం, పెదవులు, కళ్ల వద్ద వాపు కనిపించడం.. వంటి లక్షణాలేవైనా గమనిస్తే వెంటనే దగ్గర్లోని డాక్టర్ని సంప్రదించాలి.
చూశారుగా.. పాలిచ్చే తల్లులు ఏయే పదార్థాలకు దూరంగా ఉంటే మంచిదో. వీటికి దూరంగా ఉండటం వల్ల కేవలం తల్లులే కాదు.. పిల్లలు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- అతను తగినవాడేనా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!