Published : 17/12/2022 18:19 IST

మడమలు పగులుతున్నాయా.. మాస్క్ వేయండిలా..!

వేప, పసుపుతో..

కావాల్సినవి:

⚛ వేపాకులు- పిడికెడు

⚛ పసుపు- 3 టీస్పూన్స్

తయారీ:

ముందుగా పిడికెడు వేపాకుల్ని తీసుకుని మెత్తగా ముద్ద చేసుకోవాలి. అందులో 3 టీస్పూన్స్ పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు పట్టించి అరగంట పాటు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో పాదాలను శుభ్రం చేసుకుని, పొడిగా అయ్యాక మాయిశ్చరైజర్ రాసుకోవాలి.


నిమ్మరసం, రోజ్‌వాటర్‌తో..

కావాల్సినవి:

⚛ నిమ్మరసం- 1 టీస్పూన్

⚛ ఉప్పు- 1 టీస్పూన్

⚛ గ్లిజరిన్- 1 టీస్పూన్

⚛ రోజ్‌వాటర్- 1 టీస్పూన్

తయారీ:

ముందుగా ఒక టబ్లో కొద్దిగా గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో పైన చెప్పినవన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఆ నీటిలో పాదాలను 10 నుంచి 15 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత స్క్రబ్ చేసి మృతకణాలను తొలగించుకోవాలి. ఇప్పుడు కాస్త గ్లిజరిన్‌లో ఒక్కో టీస్పూన్ చొప్పున నిమ్మరసం, రోజ్‌వాటర్ కలిపి పాదాలకు మాస్క్‌లా వేయాలి. అలా 15 నుంచి 30 నిమిషాలు ఉంచిన తర్వాత గోరువెచ్చని నీటితో పాదాలను శుభ్రం చేసుకోవాలి. టవల్‌తో శుభ్రంగా తుడుచుకుని, పొడిగా అయిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా రోజూ చేస్తే పగుళ్లు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని