ఆ సమస్యకు పరిష్కారమిలా..!

ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే పాదాల నుంచి దుర్వాసన వస్తుంటుంది. దీనికి ఎన్నో కారణాలుంటాయి. అయితే మనకు అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలతో ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చంటున్నారు....

Published : 12 Nov 2022 21:22 IST

ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే పాదాల నుంచి దుర్వాసన వస్తుంటుంది. దీనికి ఎన్నో కారణాలుంటాయి. అయితే మనకు అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలతో ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చంటున్నారు నిపుణులు.

పటిక పొడితో..

ఒక కప్పు గోరువెచ్చని నీటిలో చెంచా పటిక పొడిని వేయాలి. ఈ మిశ్రమంతో పాదాలను శుభ్రం చేసుకొని 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వాలి. ఆరిన పాదాల మీద కూడా కొద్దిగా పటిక పొడిని చల్లుకోవాలి. ఈ విధంగా రోజుకోసారి చేయడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది. పటికలో ఉండే యాంటీ సెప్టిక్‌ గుణాలు బ్యాక్టీరియాను నశింపజేస్తాయి. కాబట్టి పాదాల నుంచి వెలువడే దుర్వాసన సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.

లావెండర్‌ ఆయిల్‌తో..

లావెండర్‌ ఆయిల్‌కి బ్యాక్టీరియాని నశింపజేసే గుణం కూడా ఉంది. ఇందులో ఉండే యాంటీ ఫంగల్‌ గుణాల కారణంగా బ్యాక్టీరియా సులభంగా నశిస్తుంది. కొద్దిగా గోరువెచ్చని నీరు తీసుకుని అందులో కొన్ని చుక్కల లావెండర్‌ ఆయిల్‌ వేయాలి. ఈ మిశ్రమంలో పాదాలను 15 నుంచి 20 నిమిషాలు నాననిచ్చి ఆ తర్వాత పొడి టవల్‌తో తుడిచేసుకోవాలి. ఇలా రోజుకి రెండుసార్లు చొప్పున కొద్ది రోజులు క్రమం తప్పకుండా చేస్తే పాదాల నుంచి దుర్వాసన రాదు సరికదా.. లావెండర్‌ ఆయిల్‌ వల్ల చక్కటి పరిమళం వెదజల్లుతాయి.

బ్లాక్‌టీతో..

బ్లాక్‌ టీలో ఉండే ట్యానిన్స్‌ లేదా ట్యానిక్‌ యాసిడ్‌ వల్ల బ్యాక్టీరియా సులభంగా తొలగిపోతుంది. కాబట్టి పాదాల నుంచి వచ్చే దుర్వాసనకు చెక్‌ పెట్టడానికి దీన్ని కూడా ఒక మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక బేసిన్‌లోకి నాలుగు కప్పుల వేడి నీళ్లు లేదా మరుగుతున్న నీళ్లు తీసుకొని అందులో 5 బ్లాక్‌ టీ బ్యాగ్స్‌ వేసి 10 నిమిషాల పాటు నాననివ్వాలి. తర్వాత పాదాలను 15 నుంచి 20 నిమిషాలు అందులో నానబెట్టాలి. ఈ విధంగా రోజుకోసారి చేయడం వల్ల దుర్వాసన సమస్యకు సులభంగా చెక్‌ పెట్టవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్