శుభవార్త చెప్పేస్తారు..!

పనిచేసే చోట అయినా, బంధువుల్లో అయినా గర్భిణిగా ఉన్న వాళ్లను చూస్తూ, వాళ్ల గురించి వింటూ ఉంటే మనసుకు ఏదో తెలియని ఆనందమేస్తుంది కదా! అయితే, గర్భధారణ అనే భావన... ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందట.

Updated : 30 May 2024 15:29 IST

మీకు తెలుసా?

పనిచేసే చోట అయినా, బంధువుల్లో అయినా గర్భిణిగా ఉన్న వాళ్లను చూస్తూ, వాళ్ల గురించి వింటూ ఉంటే మనసుకు ఏదో తెలియని ఆనందమేస్తుంది కదా! అయితే, గర్భధారణ అనే భావన... ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందట. జర్మనీలో 30వేల మంది మహిళలపై చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. సహోద్యోగి బిడ్డకు జన్మనిచ్చిన ఏడాదిలో మిగతా మహిళా ఉద్యోగుల్లోనూ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం పెరిగిందని తేలింది. సుప్తచేతనలో వాళ్లూ అలా కావాలనుకోవడంతో ఫెర్టిలిటీ హార్మోన్లు విడుదల కావడమే ఇందుకు కారణమట. మరి మీ ఆఫీసులో ఎవరైనా తల్లి కాబోతున్నారా! అయితే త్వరలోనే ఇంకొందరు మహిళలు కూడా శుభవార్త చెప్పే అవకాశం ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్