ఇలా చేస్తే అధికబరువు దూరం...

పాతికేళ్ల అమల సన్నబడటానికి వ్యాయామాలు చేస్తున్నా... బరువు తగ్గడంలేదు. దీంతో నిరాశకు గురవుతోంది. 20 నుంచి 55 ఏళ్లలోపు వారు ఎత్తుకు తగిన బరువుండేలా జాగ్రత్తపడితే వృద్ధాప్యంలో అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు నిపుణులు

Updated : 10 Oct 2021 06:14 IST

పాతికేళ్ల అమల సన్నబడటానికి వ్యాయామాలు చేస్తున్నా... బరువు తగ్గడంలేదు. దీంతో నిరాశకు గురవుతోంది. 20 నుంచి 55 ఏళ్లలోపు వారు ఎత్తుకు తగిన బరువుండేలా జాగ్రత్తపడితే వృద్ధాప్యంలో అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు నిపుణులు. రోజూ తీసుకునే ఆహారంద్వారా అధికంగా చేరే 100-200 కెలోరీలే క్రమేపీ బరువును పెంచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు.

* తక్కువగా...
రోజూ ఆహారంలో కనీసం 100 నుంచి 200 కెలోరీలను తగ్గించడానికి ప్రయత్నించాలి. అలాగే 200 కెలోరీలు కరిగేలా వ్యాయామాలు చేయాలి. ఇలా చేస్తే బరువు సమన్వయమవుతుంది. అంటే .. తగ్గడం మాట అటుంచి పెరగకుండా ఉంటారు. అమెరికాకు చెందిన ఓ నిపుణుల బృందం అధికబరువుపై 3000 మందిపై చేసిన అధ్యయనం తర్వాత ఈ విధానాలను సూచించింది.

* చిన్నగా...
ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు కాస్త ముందుగా బయలుదేరి ఇంటినుంచి బస్టాండుకు నడిచి వెళ్లడం లేదా ఒక స్టాపు ఉందనగానే దిగి, అక్కడి నుంచి ఆఫీస్‌కు నడవడం వంటివి శరీరానికి వ్యాయామంలా పనిచేస్తాయి. ప్రతి చిన్న పనికి బైక్‌, కారును వినియోగించకుండా నడిచి వెళితే  కొన్ని కెలోరీలనైనా  తగ్గించుకోవచ్చు. సాయంత్రం స్నాక్స్‌ చిప్స్‌వంటివాటికి బదులు తాజా కూరగాయలు, పండ్ల సలాడ్లు తీసుకుంటే కెలోరీలు పెరిగే ప్రమాదం ఉండదు.  రోజుకి ఆరేడుగ్లాసుల నీటిని తాగాలి.

* వంటలో...
ఏ వంటకైనా నూనె తక్కువగా వాడాలి. వేపుళ్లు, పూరీ, దోసె వంటివాటికి దూరంగా ఉండాలి. కూరగాయలను ఆవిరిపై ఉడికించుకోవాలి. స్వీట్లు తినే అలవాటును తగ్గించుకోవాలి. పెంపుడు జంతువును వాకింగ్‌కు తీసుకెళ్తే మీకూ వ్యాయామం.

* నడక...  ఆహారాన్ని తీసుకునే ప్లేటు చిన్నగా ఉండాలి. భోజనానికి ముందు పీచు ఉండే తాజా కాయగూరల సలాడ్లు తీసుకుంటే కడుపు నిండిన భావన కలుగుతుంది. దాంతో ఎక్కువ భోజనాన్ని తినలేం. కెలోరీలు పెరగవు. ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడటం, టీవీ చూడటం వంటివాటికి దూరంగా ఉంటే మంచిది. ఏకాగ్రతగా ఆహారాన్ని నమిలి మింగడంతో జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అధిక కొవ్వు పేరుకునే ప్రమాదం ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్