ఈ వయసులో సెక్స్‌ మంచిదేనా!

మెనోపాజ్‌ వచ్చాక వేడి ఆవిర్లు, అరికాళ్ల మంటలు లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా. సెక్స్‌లో తరచూ పాల్గొంటే ఇలాంటి అనారోగ్యాలేవీ రావంటున్నారు మా వారు. నాకేమో ఇంకేం ఇబ్బందులు వస్తాయోనని భయం. ఈ సమయంలో సెక్స్‌లో పాల్గొనొచ్చా?

Updated : 21 Oct 2021 06:05 IST

మెనోపాజ్‌ వచ్చాక వేడి ఆవిర్లు, అరికాళ్ల మంటలు లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా. సెక్స్‌లో తరచూ పాల్గొంటే ఇలాంటి అనారోగ్యాలేవీ రావంటున్నారు మా వారు. నాకేమో ఇంకేం ఇబ్బందులు వస్తాయోనని భయం. ఈ సమయంలో సెక్స్‌లో పాల్గొనొచ్చా?

- ఓ సోదరి, హైదరాబాద్‌

మెనోపాజ్‌ దశలో వేడిగా అనిపించడం, చెమటలు లాంటివి తరచుగా కనిపిస్తాయి. ఆరోగ్య సమస్యలు, విటమిన్‌ లోపాలుంటే ఈ ఇబ్బందులు మరికాస్త ఎక్కువగా అనిపించవచ్చు. కాబట్టి ఈ దశలో తప్పనిసరిగా ఏడాదికొకసారి గైనకాలజిస్ట్‌తో పరీక్షలు చేయించుకోవాలి. వారి సూచనల మేరకు విటమిన్‌, క్యాల్షియం సప్లిమెంట్లు వేసుకుంటూ, సమతుల ఆహారం, చక్కటి జీవనశైలితో చాలావరకు సమస్యను అధిగమించవచ్చు.

శారీరక, మానసిక ఆరోగ్యం... ఈ వయసు (మెనోపాజ్‌ దశ)లో తరచూ శృంగారంలో పాల్గొనవచ్చా అని అడిగారు. ఒక జంట ఎంత తరచుగా, ఏ వయసు వరకు కలయికలో పాల్గొంటారు అనేది వారి అలవాట్లు,  ఇష్టాయిష్టాలు, వారి ఆరోగ్య స్థితిగతులను బట్టి ఉంటుంది. కచ్చితంగా ఫలానా వయసు వచ్చేసరికి దూరంగా ఉండాలనే నియమాలేవీ లేవు. మీవారు చెప్పినట్లుగా ఈ వయసులో  శృంగారం కొనసాగించడం వల్ల కొన్ని లాభాలున్నాయి. ఇదొక వ్యాయామంతో సమానం కాబట్టి కెలొరీలు ఖర్చవుతాయి. దాంతో బరువు పెరగరు. ఈ సమయంలో ఎన్నో కండరాలు కదలికలు జరిగి వాటి పటుత్వం పెరిగి, పనితీరు మెరుగవుతుంది. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు శరీరానికి మేలు చేసే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయి. ఆలుమగల మధ్య మరింత దృఢమైన అనుబంధానికి, వారి జీవితకాలం పెరగడానికి సంభోగం కొనసాగింపు దోహదపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇబ్బందులూ ఉన్నాయి.. ఈ వయసులో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురు కావొచ్చు. ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ స్థాయులు తగ్గిపోవడంతో... వెజైనా పొడి బారడం, కలయికలో నొప్పి, మంట, ఇబ్బందిగా అనిపించడం జరుగుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి వెజైనల్‌ మ్యూకస్‌ మెమ్‌బ్రేన్‌ (యోని పొర) పొడిబారకుండా ఉండటానికి ఈస్ట్రోజెన్‌ క్రీములు వాడమని సూచిస్తారు వైద్యులు. అలాగే కలయిక సమయంలో ల్యూబ్రికేటింగ్‌ జెల్లీలు వాడితే మంట, నొప్పి కూడా ఉండవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్