ఇంటిల్లపాదికీ అందించం‘డి’

చలి బాగా అనిపిస్తే ఇంట్లో వాళ్లు, పిల్లలు పొద్దెక్కేదాకా దుప్పట్లలో ఉండిపోతారు. లేదా మందపాటి దుస్తులతో ఒంటిని కప్పేస్తారు. ఇలాగైతే డి విటమిన్‌ ఎలా అందుతుంది? రోగ నిరోధక శక్తి పెరగాలన్నా, ఎముకలు, దంత ఆరోగ్యం దేనికైనా ఇది తప్పనిసరి. మానసిక ఆరోగ్యంపైనా దీని ప్రభావముంటుంది అంటున్నారు నిపుణులు. కాబట్టి, ఇంటిల్లపాదికీ ‘డి’ అందేలా చూసుకోవాల్సింది మనమే....

Updated : 08 Jan 2022 12:26 IST

లి బాగా అనిపిస్తే ఇంట్లో వాళ్లు, పిల్లలు పొద్దెక్కేదాకా దుప్పట్లలో ఉండిపోతారు. లేదా మందపాటి దుస్తులతో ఒంటిని కప్పేస్తారు. ఇలాగైతే డి విటమిన్‌ ఎలా అందుతుంది? రోగ నిరోధక శక్తి పెరగాలన్నా, ఎముకలు, దంత ఆరోగ్యం దేనికైనా ఇది తప్పనిసరి. మానసిక ఆరోగ్యంపైనా దీని ప్రభావముంటుంది అంటున్నారు నిపుణులు. కాబట్టి, ఇంటిల్లపాదికీ ‘డి’ అందేలా చూసుకోవాల్సింది మనమే.

సాధారణంగా చలి దేశాల్లో విటమిన్‌ డి లోపం సహజమే. నిత్యం వేడి వాతావరణం ఉండే మనదేశంలోనూ 76 శాతం మందిలో ఈ లోపం కనిపిస్తోందని తాజాగా ఓ నివేదిక చెబుతోంది. పిల్లల్లో ఎదుగుదలపైనా, మిగతావారిలో ఎముకలు, మానసిక ఇబ్బందులకు కారణమవగలదని హెచ్చరిస్తున్నారు. ఎముకల నొప్పి, వీపు భాగంలో ఇబ్బంది, అలసిపోవడం, తరచూ ఇన్ఫెక్షన్లు, గాయాలు త్వరగా మానకపోవడం, జుట్టు రాలడం, ఆత్రుత వంటివన్నీ దీని లోపానికి చిహ్నాలే. కాబట్టి.. ఇంట్లో వాళ్లంతా రోజూ ఉదయం 15-20 నిమిషాలు ఎండలోకి వెళ్లేలా చూడండి. చలి నుంచీ హాయి.. శరీరానికి కావాల్సిన డి విటమినూ అందుతుంది. పాలపదార్థాలు, చేప నూనె, పుట్టగొడుగులు, గుడ్డు పచ్చసొనల్లో ఇది ఎక్కువ మోతాదులో ఉంటుంది. వీటిలో వీలైనవి రోజూ తీసుకోండి. మందుల ద్వారానూ తీసుకోవచ్చు. కానీ వీటిని ఎక్కువగా గర్భిణులు, చిన్నారులు, మెనోపాజ్‌ దశలో ఉన్న మహిళలు, 65 ఏళ్లు పైబడిన వారికీ ఇస్తారు. మరీ అవసరమై వైద్యులు సూచిస్తే తప్ప మందుల జోలికి పోకపోవడం మేలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్