Published : 23/06/2021 00:44 IST

ఆరంభంలోనే అసూయకు చెక్‌ పెట్టాలి..

సుశీల తన ఇద్దరి కూతుళ్లకు చాలా విషయాల్లో సర్దిచెప్పలేక సతమతవుతుంది. ఒకరి దుస్తులు, నగలు, పుస్తకాలను చూసి మరొకరు ఉడుక్కుంటారు. తోబుట్టువులైనా ఒకరిని చూస్తే మరొకరికి అసూయ. కొందరు పిల్లలైతే తమ బొమ్మలపై తోటి చిన్నారులను చేయి కూడా వేయనివ్వరు. పిల్లల్లో ఈ తరహా అసూయ, స్వార్థం వంటి లక్షణాలను గుర్తిస్తే వాటిని చిన్నప్పటి నుంచే మార్చగలగాలి. లేదంటే పెద్దైన తర్వాత వారికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు మానసిక నిపుణులు.
* ఒత్తిడి తేకుండా...
పిల్లలు తమ బొమ్మలు, వస్తువులను ఇతరులు తీసుకుంటే సాధారణంగా ఒప్పుకోరు. అలాగే తోటి పిల్లల ఆట వస్తువులను చూసి అసూయ పడతారు. వాటిని లాక్కోవడానికి చూస్తారు. ఈ లక్షణాల్ని గుర్తించిన వెంటనే మార్చడానికి ప్రయత్నించాలి. తమవి ఇతరులకూ ఇవ్వడం నేర్పాలి. అసూయ తప్పని చెప్పాలి. అయితే ప్రారంభంలో పిల్లలపై ఈ అంశాల్లో ఎక్కువగా ఒత్తిడి తేకుండా సున్నితంగా వివరించాలి. అప్పుడే వింటారు. అరవడం, తీవ్రంగా విమర్శించడం చేస్తే పూర్తిగా పెడచెవిన పెడతారు.
* పంచడం నేర్పాలి...
ఇంటికెవరైనా వస్తే, వారి చిన్నారులకు తమ వద్ద ఉన్న ఆట వస్తువులను కాసేపు ఆడుకోవడానికి ఇవ్వమని చెప్పాలి. మొదట తిరస్కరించినా నెమ్మదిగా అలవాటవుతుంది. ఇది పంచుకునే గుణాన్ని పెంచుతుంది. దీంతో ఇతరుల వస్తువులను చూసి అసూయ పడటం, తమ బొమ్మలు తమ వద్దే ఉండాలనే స్వార్థం క్రమేపీ దూరమవుతాయి. పిల్లలతో పేదవారికి సాయపడటం, తమ పుస్తకాలు, పెన్సిళ్లు, పాతబ్యాగులు వంటివి ఇప్పించాలి. ఈ అలవాట్లు వారిలో తోటివారికి సాయపడే గుణాన్ని పెంచుతాయి. తమ వద్ద ఉన్నదాన్ని లేనివాళ్లకు అందించాలనే ఆలోచన చిన్నప్పటి నుంచి వారి మనసులో నాటాలంటే తల్లిదండ్రులు కూడా అదే మార్గాన్ని అనుసరించాలి. అప్పుడే పెద్దవారిని పిల్లలు స్ఫూర్తిగా తీసుకుంటారు.
* ఇచ్చిపుచ్చుకోవడం..
తోటిపిల్లలతో ఆడుకుంటున్న చిన్నారులకు ఇచ్చిపుచ్చుకోవడం నేర్పించడం తేలిక అని చెబుతున్నారు నిపుణులు. ఒకరి బొమ్మలు ఎదుటివారికిచ్చి, వారి నుంచి కావాల్సిన వాటిని తీసుకోవడంలో ఇద్దరూ ఎక్కువసేపు సరదాగా ఆడుకోవచ్చు అని పిల్లలకు చెప్పాలి. ఈ పద్ధతిని అలవరుచుకుంటే వారిలో ఇతరులను తమతో కలుపుకొనే మంచి మనస్తత్త్వం ఏర్పడుతుంది. ఇది వారిలో అసూయ, స్వార్థం వంటి లక్షణాలను దూరం చేసి, కలివిడితనాన్ని నేర్పుతుంది.
* ప్రత్యేక రోజుల్లో
తల్లిదండ్రులు ప్రత్యేక రోజుల్లో  పిల్లలను అనాథాశ్రమం, వృద్ధాశ్రమం వంటి వాటికి తీసుకెళ్లాలి. పుట్టినరోజులు, పండగలు వచ్చినప్పుడు కొంత సమయం అక్కడ గడిపేలా చూడాలి. వారికి ఆహారం, నిత్యావసర వస్తువులు వంటివి పిల్లలతో ఇప్పించాలి. ఇది వారిలో దానగుణాన్ని అలవరుస్తుంది. తమకన్నా పేదరికంలో ఉన్నవాళ్లు ఈ ప్రపంచంలో ఉన్నారని చిన్నారులు తెలుసుకోవాలి. ఎన్ని బొమ్మలు, దుస్తులున్నా ఏమీ లేవు అంటూ పేచీ పెట్టే అలవాటును మానుకుంటారు. ఎందుకంటే, అవి కూడా లేనివారు ఎందరో ఉన్నారని వారికి అర్థమవుతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని