వరుసగా అబార్షన్లు!.. పిల్లల కోసం మళ్లీ ప్రయత్నించొచ్చా?

నాకు 30. పెళ్లై 14 ఏళ్లవుతోంది. మొదటి కాన్పు సహజ ప్రసవం.  రెండో సారి అధిక రక్తస్రావమై బిడ్డ కడుపులోనే చనిపోయాడు. ఆ తర్వాతా అదే సమస్యతో ఆరు, ఏడు, ఎనిమిది నెలల్లో అబార్షన్లు

Updated : 26 Aug 2021 07:15 IST

నాకు 30. పెళ్లై 14 ఏళ్లవుతోంది. మొదటి కాన్పు సహజ ప్రసవం.  రెండో సారి అధిక రక్తస్రావమై బిడ్డ కడుపులోనే చనిపోయాడు. ఆ తర్వాతా అదే సమస్యతో ఆరు, ఏడు, ఎనిమిది నెలల్లో అబార్షన్లు అయ్యాయి. ఇవన్నీ జరిగి మూడేళ్లవుతోంది. ఆరు నెలలుగా నెలసరిలో తీవ్ర రక్త స్రావమవుతోంది. రక్తం గడ్డలు పడుతున్నాయి. గర్భాశయంలో వాపు, హిమోగ్లోబిన్‌ శాతం చాలా తక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పారు. పిల్లల కోసం మళ్లీ ప్రయత్నించొచ్చా?

- ఓ సోదరి, వికారాబాద్‌

ర్భం దాల్చిన ప్రతిసారీ ఎక్కువగా బ్లీడింగ్‌ అవుతోందంటే ఏదో తీవ్ర సమస్యే ఉందని అర్థమవుతోంది. ఇలా జరగడానికి గర్భాశయం, ప్లసెంటాకు సంబంధించిన సమస్యలు లేదా శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థలో లోపాలు (ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌), ఆప్లా సిండ్రోమ్‌ (ఏపీఎల్‌ఏ సిండ్రోమ్‌ ), సిస్టమిక్‌ లూథాన్స్‌ ఎరిథెమాటోసస్‌ (ఎస్‌ఎల్‌ఇ), మూత్రపిండాలు, కాలేయ సమస్యలు... ఇలాంటివి ఏవైనా కారణం కావొచ్చు. మీరు హిమోగ్లోబిన్‌ శాతం పెరగడానికి మందులు వాడటం, గర్భాశయ వాపునకు చికిత్స తీసుకోవడం ముఖ్యం. ఇప్పుడు కూడా మీరు సంతానం కోసం ప్రయత్నించాలనుకుంటే పరీక్షలు చేయించుకుని సమస్య ఏమిటో తెలుసుకున్నాకే ఓ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.
దీని కోసం 3డీ/4డీ ట్రాన్స్‌ వెజైనల్‌ స్కాన్‌, కిడ్నీ స్కాన్‌ యాంటీబాడీస్‌, హోమోసిస్టిన్‌ పరీక్షలు, మధుమేహం, కిడ్నీ, లివరు ఫంక్షనల్‌ పరీక్షలు... ఇవన్నీ చేయించుకోవాలి. మీ ఉత్తరాన్ని బట్టి బిడ్డల్లో లోపాల వల్ల ఇలా అయ్యిందని అనిపించడం లేదు. మీ భార్యాభర్తలిద్దరూ ఓసారి క్రోమోజోమ్‌ పరీక్షలు చేయించుకుంటే మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్