బొమ్మల పుస్తకాలతో బోర్‌ కొట్టదు!

పిల్లలను చదివించడం, వారితో హోంవర్క్‌లు చేయించడం ఓ పెద్ద ప్రహసనం. చిన్నారులకు చదువుపై ఆసక్తి కలిగించాలన్నా, వాళ్లంతట వాళ్లుగా చదువుకునేలా చేయాలన్నా... ఈ చిట్కాలు ఉపయోగపడతాయి.

Published : 27 Sep 2021 00:42 IST

పిల్లలను చదివించడం, వారితో హోంవర్క్‌లు చేయించడం ఓ పెద్ద ప్రహసనం. చిన్నారులకు చదువుపై ఆసక్తి కలిగించాలన్నా, వాళ్లంతట వాళ్లుగా చదువుకునేలా చేయాలన్నా... ఈ చిట్కాలు ఉపయోగపడతాయి.

బొమ్మల పుస్తకాలతో... మీ చిన్నారి దృష్టిని చదువుపై మళ్లించాలంటే ముందు అది వారి కళ్లను ఆకట్టుకునేలా ఉండాలి. ఇందుకు బొమ్మలు, రంగులు, గ్రాఫిక్స్‌తో ఉన్న కథల పుస్తకాలు ఉపయోగపడతాయి. విషయమూ త్వరగా అర్థమవుతుంది.

ప్రకటనలూ చదివించండి... చదువంటే తరగతికి సంబంధించిన పుస్తకాలే కాదు... పత్రికలు, కథలు, బ్రోచర్‌లు, కార్టాన్స్‌, సైన్‌బోర్డులపై కనిపించేవి ఏవైనా కావొచ్చు. వాటితో మొదలుపెడితే... తమ ఉత్సాహాన్ని ఆపుకోలేరు. అంతేకాదు అప్పుడప్పుడూ ఇతర పిల్లలతో వాటిని వేగంగా ఉచ్ఛరించడం, తప్పులు పట్టుకోవడం వంటి సరదా పోటీలు పెట్టండి. అప్పుడు ఉత్సాహంగా అలవాటు చేసుకుంటారు. పాఠ్యాంశాలనూ సులువుగా ఒంటపట్టించుకుంటారు.

మీరూ వారితో పాటే.... ఏదో ఒక పుస్తకం ఫలానా సమయానికల్లా పూర్తిచేయాలనే నియమం పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. వారికి పుస్తక పఠనంపై ఆసక్తి పెంచడానికి మీతోడు అవసరం. చిన్నారికి కథలను, పాఠ్యాంశాలను వివరించి చెప్పండి. ఉత్సుకతను పెంచే ప్రశ్నలు వేయండి. వారంతట వారు చదువు కొంటుంటే... మీరూ ఓ మంచి పుస్తకం చదవండి. అవి చూసి పిల్లలకు క్రమశిక్షణ, బాధ్యత అలవడతాయి.

లైబ్రరీ ఏర్పాటు.... పిల్లల్లో పఠనాసక్తిని పెంచడానికి వారికి నచ్చే పాత్రలు, కథల పుస్తకాలను సేకరించండి. వారికోసం ఓ చిన్నపాటి లైబ్రరీని ఏర్పాటు చేయండి. అప్పుడప్పుడూ వారిని దగ్గర్లోని గ్రంథాలయానికీ, వారు మెచ్చే బుక్స్‌ కొనుక్కునేందుకు పుస్తకాల షాపునకీ తీసుకెళ్లండి. ఇవన్నీ వారికి ఉత్సాహాన్నిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్