పిల్లల పట్ల... ఈ తప్పులొద్దు!

పిల్లలకు అమ్మానాన్నలే మార్గనిర్దేశకులు. అందుకే మనమూ బాధ్యతగా ఉండాలి. వారి విషయంలో చేయకూడని పొరపాట్లివీ...

Updated : 27 Nov 2021 05:52 IST

పిల్లలకు అమ్మానాన్నలే మార్గనిర్దేశకులు. అందుకే మనమూ బాధ్యతగా ఉండాలి. వారి విషయంలో చేయకూడని పొరపాట్లివీ...

ప్రేమను వ్యక్తపరచండి... బిడ్డలంటే అపారమైన ప్రేమ సహజం. వాళ్ల కోసం ఏ త్యాగాలకైనా సిద్ధపడతారు. మరి దాన్ని మాటల్లో చెబుతున్నారా? మీరు ప్రేమను వ్యక్తం చేయకపోతే అది వారి మానసిక స్థితిపై ప్రభావాన్ని చూపొచ్చు. తద్వారా భవిష్యత్తుపై కూడా. కాబట్టి మీ ప్రేమను మాటల్లో వ్యక్తం చేస్తుండండి. వాళ్లు చేసే మంచిని ప్రోత్సహించండి.

అన్నింటా ఆంక్షలొద్దు.. పిల్లల విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటుంటాం. అన్నింట్లోనూ వారి ప్రమేయం లేకుండా చేయొద్దు. దుస్తులు, వస్తువులు వంటి వాటిల్లో వాళ్ల నిర్ణయాలకీ ప్రాధాన్యమివ్వాలి. అభిప్రాయాలను తెలుసుకోవాలి. లేదంటే ప్రతి విషయానికీ ఒకరిపై ఆధారపడతారు. సొంత నిర్ణయాలు తీసుకోలేని స్థితికి చేరతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోలేరు.

హద్దులు గీయొద్దు... పిల్లలు పెరిగే క్రమంలో పరిశీలనతోనే నేర్చుకుంటారు. తప్పొప్పులు చెప్పండి చాలు. వేలు పట్టి నేర్పించొద్దు. లేదంటే మీపై వ్యతిరేకతను ఏర్పరచుకోవడమో, మీకు తెలియకుండా చేయాలనుకోవడమో చేస్తారు. అబద్ధాలు మొదలుపెట్టినా ఆశ్చర్యం లేదు. కాబట్టి, ప్రయత్నించనివ్వండి. పొరబాట్లను వారించడానికెలాగూ మీరుంటారుగా!

పోట్లాడొద్దు.. సమస్య ఎంత పెద్దదైనా.. చిన్నారుల ముందు భార్యాభర్తలిద్దరూ వాదించుకోవడం, గొడవపడటం చేయొద్దు. ఇది వారి మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అమ్మా నాన్నలంటే ప్రేమానురాగాలకు ప్రతిరూపాలుగా ఉండాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్