డిఫెన్స్‌ కెరియర్‌ అవకాశాలపై..ఆన్‌లైన్‌ సెమినార్‌!

సహనానికే కాదు.. సాహసానికీ చిరునామాగా నిలుస్తున్నారు నేటితరం అమ్మాయిలు. అయినా దేశరక్షణ విభాగంలో నిన్న మొన్నటివరకూ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌కే మన సేవలు పరిమితమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో

Updated : 10 Dec 2021 01:46 IST

హనానికే కాదు.. సాహసానికీ చిరునామాగా నిలుస్తున్నారు నేటితరం అమ్మాయిలు. అయినా దేశరక్షణ విభాగంలో నిన్న మొన్నటివరకూ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌కే మన సేవలు పరిమితమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మనమూ ఇక శాశ్వత విధుల్లో పనిచేయొచ్చు! మాతృభూమికి సేవ చేయాలనుకునే అమ్మాయిలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇంకా సందేహమా? వాటిని మేం తీరుస్తాం. ఈనాడు ఆధ్వర్యంలో ‘సాయుధ బలగాల్లో ఉద్యోగావకాశాలు’ అనే అంశంపై ఈ నెల 11న ఆన్‌లైన్‌ సదస్సును నిర్వహిస్తున్నాం. ఉదయం 11గం. నుంచి మధ్యాహ్నం 12.30 గం. వరకూ ఈ కార్యక్రమం ఉంటుంది. త్రివిధ దళాల్లో ఉద్యోగావకాశాలు, ఉద్యోగప్రకటనలు, ప్రవేశపరీక్షలకు సంబంధించి అర్హతలు, సన్నద్ధత, ఇంటర్వ్యూ సహా అన్నింటి గురించీ ఇక్కడ తెలుసుకోవచ్చు. విశాఖ తూర్పు నౌకాదళానికి చెందిన లెఫ్టినెంట్‌ కమాండర్‌ విజయలక్ష్మి, కెప్టెన్‌ ఎస్‌.రవీంద్ర ఈ అంశాలపై ప్రసంగిస్తారు. అనుమానాల నివృత్తికి ప్రశ్నోత్తరాల సమయమూ ఉంటుంది. సాయుధ బలగాలపై ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

* రిజిస్ట్రేషన్లకు మీ పేరు, ఫోన్‌ నంబరు, ఈ-మెయిల్‌ ఐడీ వివరాలతో 8008055788 నంబరుకు ఈరోజు సాయంత్రం 5గం.లోగా  మెసేజ్‌ చేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్