తీగల అందాన్ని తెచ్చేయండి

ఇంటి అందాన్ని పెంచడంలో మొక్కలు ముందుంటాయి. అందునా తీగల్లా అల్లుకునేవి కొత్త లుక్‌ను తెచ్చిపెడతాయి. దీనికితోడు స్వచ్ఛమైన గాలీ మన సొంతం. మీకూ ప్రయత్నించాలనుందా! అయితే వీటిని చూడండి.

Updated : 11 Dec 2021 06:06 IST

ఇంటి అందాన్ని పెంచడంలో మొక్కలు ముందుంటాయి. అందునా తీగల్లా అల్లుకునేవి కొత్త లుక్‌ను తెచ్చిపెడతాయి. దీనికితోడు స్వచ్ఛమైన గాలీ మన సొంతం. మీకూ ప్రయత్నించాలనుందా! అయితే వీటిని చూడండి.

బోగన్‌విలియా.. మన దగ్గర ఎక్కువగా కనిపించే తీగ రకాల్లో ఇదొకటి. పూలు అదనపు ఆకర్షణ. సూర్యరశ్మి, కాసిన్ని నీళ్లు ఉంటే చాలు చక్కగా ఎదుగుతుంది. బోలెడు రంగుల్లోనూ దొరుకుతాయి.


డెవిల్స్‌ ఐవీ... మనీప్లాంట్‌గా పిలుచుకుంటాం. హృదయాకార ఆకులు.. పసుపు, తెల్ల ఈనెలు దీని ప్రత్యేకత. ఈ కాలంలో రోజు మార్చి రోజు నీళ్లు పోసినా పెరుగుతుంది. పెద్దగా పోషణ, సంరక్షణ అవసరముండదు.


కర్టెన్‌ క్రీపర్‌... బలహీన కాండం కారణంగా గోడ, మెట్లు ఇలా ఏదోకదాన్ని ఆలంబనగా చేసుకుని పాకుతుంది. వేర్లు బలంగా అయ్యాక పూలు పూస్తూ కర్టెన్‌లా పరుచుకుంటుంది. ప్రకృతి వనమా అన్నట్లుగా ఆకర్షించేస్తుంది.


అల్‌మండా... బంగారు రంగు పూలు పూసే దీన్ని ‘గోల్డెన్‌ ట్రంపెట్‌’ అనీ పిలుస్తారు. అమెరికాకు చెందినదే అయినా మన దగ్గరా చక్కగా పెరుగుతుంది. అయితే అధిక మొత్తంలో సూర్యరశ్మి కావాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్