వీటిపై ఓ కన్నేయండి!

మార్కెట్లో కొత్త సౌందర్య పోషక ఉత్పత్తుల కోసం వెతుకుతున్నారా? ముందు మీ వంటింట్లోని ఈ వస్తువులపై ఓ కన్నేయండి!

Updated : 14 Dec 2021 05:38 IST

మార్కెట్లో కొత్త సౌందర్య పోషక ఉత్పత్తుల కోసం వెతుకుతున్నారా? ముందు మీ వంటింట్లోని ఈ వస్తువులపై ఓ కన్నేయండి!

* కాఫీపొడి: ఉదయాన్నే మనకు శక్తినీ, ఉత్సాహాన్నీ పంచే కాఫీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు చర్మాన్ని రక్షించే ఫినాల్స్‌ కూడా అధికం. ఇవి చర్మానికి రక్షణగా నిలుస్తాయి. చెంచా చొప్పున తేనె, కాఫీ పొడి కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించాలి. ఆరాక కడిగేస్తే చర్మం చక్కని నిగారింపుని సంతరించుకుంటుంది.

* కొబ్బరినూనె: ఇది శిరోజాల పోషణకి మాత్రమే అనుకుంటే పొరపాటు. చర్మానికి ఈ నూనె చేసే మేలు అంతా ఇంతా కాదు. దీన్లోని  ఫ్యాటీయాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై యాక్నె రాకుండా కాపాడతాయి. మీ మాయిశ్చరైజర్‌తోపాటు రెండు మూడు చుక్కల కొబ్బరి నూనె కూడా కలిపితే పొడి చర్మం నుంచి విముక్తి కలుగుతుంది.

* కీరదోస: కీరాకి చర్మాన్ని రక్షించే గుణం ఉంది. ఒక కీరా, మూడు చెంచాల పెరుగు తీసుకుని మిక్సీలో మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికీ, మెడకీ పట్టించి పదినిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ చికిత్సతో అద్భుతమైన నిగారింపుని సొంతం చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్