మరిదితో ఇబ్బందిగా ఉంది...

నా పెళ్లై రెండేళ్లయింది. మావారి తమ్ముడికి ఇంకా పెళ్లి కాలేదు. అతని చూపులు, చేష్టలూ తేడాగా ఉంటాయి. ఇన్నాళ్లూ అత్తయ్యగారు ఉంటే ఫరవాలేదు. ఇప్పుడు ఆడపడుచు ప్రసవం కోసమని ఆవిడ దిల్లీ వెళ్లారు....

Updated : 31 Aug 2021 14:35 IST

నా పెళ్లై రెండేళ్లయింది. మావారి తమ్ముడికి ఇంకా పెళ్లి కాలేదు. అతని చూపులు, చేష్టలూ తేడాగా ఉంటాయి. ఇన్నాళ్లూ అత్తయ్యగారు ఉంటే ఫరవాలేదు. ఇప్పుడు ఆడపడుచు ప్రసవం కోసమని ఆవిడ దిల్లీ వెళ్లారు. మా వారు లేని సమయంలో అతను ఇంట్లో ఉంటే చిరాగ్గా భయంగా ఉంటుంది. ఆయనకు చెప్పబోతే నాది కేవలం అనుమానమని, తన వాళ్లని దూరం చేయాలని చూస్తున్నానని నన్నే తప్పుపట్టారు. చాలా దిగులేస్తోంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి?

- ఓ సోదరి, గుంటూరు

మీ మరిది చూపులతో స్త్రీగా మీరు ఇబ్బంది పడుతున్నారు. మీ భర్తకి అది అర్థం కావడం లేదు. లేదా తమ్ముడి మీది ప్రేమ కొద్దీ పట్టించుకోవడం లేదు. ఇలాంటప్పుడు మీరేం చేయాలంటే... మీ మరిది ఇంట్లో ఉన్న సమయంలో ఏదో ఒక పని కల్పించుకోండి. లేదా బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లండి. ఒకవేళ రోజూ అతను ఉద్యోగం లేకుండా ఇంట్లోనే ఉంటూ అదే పరిస్థితి ఎదురైతే మీకు ఇష్టమైన కుట్టుపని, కుకరీ క్లాసులు, కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ లాంటి ఏదైనా కోర్సులో చేరండి. ఫైనార్ట్స్‌ నేర్చుకోండి. లేదా లైబ్రరీకి వెళ్లండి. ఇకమీదట అతని ఊసు ఎత్తకుండా తెలివిగా వ్యవహరించండి. ఇంట్లోనే ఉంటే కాలం వృథా అవుతోంది, నైపుణ్యం పెంచుకోడాని కెళ్తున్నానని చెప్పండి. ఎవరూ తప్పు పట్టడానికి లేకుండా అతనికే అన్నీ అప్పజెప్పి వెళ్లి, మీ వాళ్లు వచ్చే సమయానికి వచ్చేయండి. అవేమీ కుదరకుంటే అతనికి కావలసినవన్నీ బయట పెట్టి మీ గదిలోనే ఉండి తలుపు వేసుకోండి. భర్తగా అతను రక్షణ ఇవ్వలేనప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి కదా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్