ఆ మౌనానికి అర్థం...

దమయంతికి తన 13 ఏళ్ల కూతురిని చూస్తే ఈమధ్య ఆందోళన పెరుగుతోంది. కలుపుగోలుగా ఉంటూ, చదువులో చురుకుగా కనిపించేది. కానీ కొన్ని రోజుల నుంచి ఫోన్‌కు దూరంగా, ఒంటరిగా, నిరుత్సాహంగా ఉంటోంది.

Updated : 28 Dec 2021 05:49 IST

మయంతికి తన 13 ఏళ్ల కూతురిని చూస్తే ఈమధ్య ఆందోళన పెరుగుతోంది. కలుపుగోలుగా ఉంటూ, చదువులో చురుకుగా కనిపించేది. కానీ కొన్ని రోజుల నుంచి ఫోన్‌కు దూరంగా, ఒంటరిగా, నిరుత్సాహంగా ఉంటోంది. యుక్తవయసులోకి అడుగుపెట్టే పిల్లల్లో ఈ లక్షణాలను తల్లిదండ్రులు గుర్తించాలి అంటున్నారు మానసిక నిపుణులు. ఫోన్‌, కంప్యూటర్‌ ఎక్కువగా వాడుతూ సైబర్‌క్రైమ్‌ బాధితులుగా పిల్లలు మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే...  

పర్యవేక్షణ... బ్లాక్‌మెయిలింగ్‌, ఫేక్‌ న్యూస్‌, హెరాస్‌మెంట్‌, మార్ఫింగ్‌ వంటి వాటిలో పిల్లలు తేలికగా ఇరుక్కునే ప్రమాదం ఉంది. పిల్లలు కంప్యూటర్‌, ఫోన్‌  వినియోగిస్తుంటే పర్యవేక్షిస్తుండాలి. ఎక్కువసేపు ఛాటింగ్‌ చేస్తుంటే వారించాలి. సైబర్‌క్రైం గురించి తెలియజెప్పాలి. దానివల్ల కలిగే నష్టాలపై అవగాహన ఇంటి నుంచే మొదలవ్వాలి.

ఒత్తిడికి దూరంగా.. సైబర్‌క్రైం బాధితులైన పిల్లల్లో తీవ్ర ఆందోళన కనిపిస్తుంది. నిరుత్సాహంగా, నిత్యం ఒత్తిడిగా ఉన్నట్టు కనిపిస్తోంటే వారి భయాల్ని తెలుసుకోవడానికి తల్లి ప్రయత్నించాలి. అనునయంగా సమాచారాన్ని సేకరించగలగాలి. దండించడం, బాధపెట్టడం కాకుండా భరోసా అందించాలి. వారు చెప్పేది పూర్తిగా వినాలి. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుందనే ధైర్యాన్ని పిల్లలకివ్వాలి. పోలీసులను సంప్రదించి దాంట్లోంచి బయటపడటానికి సహాయం పొందొచ్చు.

ముందుగానే... పిల్లలు వినియోగించే కంప్యూటర్‌ లేదా ఫోన్‌లో పాస్‌వర్డ్స్‌, యాంటీ వైరస్‌, యాంటీ స్పైవేర్‌, ఛైల్డ్‌లాక్‌ వంటివి పొందుపరచాలి. వాటినీ అప్‌డేట్‌ చేస్తుండాలి. పబ్లిక్‌ వైఫైను వాడద్దు. అవసరం లేనప్పుడు బ్లూటూత్‌, లొకేషన్‌ వంటివి డిజేబుల్‌ చేయాలి. అనవసర యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేయవద్దు. సోషల్‌మీడియా వినియోగం పరిమితంగా ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్