బిడ్డను కనాలా.. విడిపోవాలా?

నా వయసు 42. పెళ్లయి నాలుగేళ్లయింది. రెండేళ్ల పాప ఉంది. నా భర్తకు విపరీతమైన అనుమానం. నన్నో మనిషిలా చూడడు. ఎప్పుడూ గొడవలే. తిడతాడు, కొడతాడు. భరించలేక పుట్టింటికి వెళ్లి 20 రోజులు ఉండి మళ్లీ వచ్చాను. ఇప్పుడు ఇంకో బిడ్డని కనకపోతే విడిపోదాం అంటున్నాడు

Updated : 19 Feb 2022 06:21 IST

* నా వయసు 42. పెళ్లయి నాలుగేళ్లయింది. రెండేళ్ల పాప ఉంది. నా భర్తకు విపరీతమైన అనుమానం. నన్నో మనిషిలా చూడడు. ఎప్పుడూ గొడవలే. తిడతాడు, కొడతాడు. భరించలేక పుట్టింటికి వెళ్లి 20 రోజులు ఉండి మళ్లీ వచ్చాను. ఇప్పుడు ఇంకో బిడ్డని కనకపోతే విడిపోదాం అంటున్నాడు. ఏ క్షణం ఏం జరగుతుందోనని భయంగా ఉంటుంది. ఇలాంటి అయోమయస్థితిలో బిడ్డని కనాలా, విడిపోవాలా? సలహా ఇవ్వండి!            

- ఓ సోదరి, వరంగల్‌

* ఆలస్యంగా పెళ్లి చేసుకుని రిస్క్‌తో బిడ్డను కన్నారు. అతను అనుమానంతో శారీరకంగా, మానసికంగా హింసిస్తున్న స్థితిలో ఇంకో బిడ్డ అంటే చాలా కష్టం. ఒకవేళ అతన్ని వదిలేస్తే మీ ఆర్థిక స్థితి, మీకు ఆసరాగా నిలిచేవారు లాంటివన్నీ చూసుకోవాల్సిన అవసరముంది. ఇంట్లో వాతావరణం సరిగా లేకపోతే పిల్లలు భయపడతారు, కుంగిపోతారు. మానసిక సమస్యలు వచ్చే అవకాశముంది. మీ ఇద్దరి కుటుంబ సభ్యులనూ పిలిచి సమస్యను చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఈ వయసులో రెండో బిడ్డను కనడం ప్రమాదం. దాన్ని లెక్కచేయలేదనుకున్నా.. అలాంటి వాతావరణంలో పిల్లల్ని పెంచడం కష్టం. అంత హింసను భరిస్తూ పడి ఉండటం మీకూ చిన్నారికీ కూడా మంచిది కాదు. ఇదంతా ఆలోచించి బిడ్డను కననని కచ్చితంగా చెప్పగలగాలి. ఆలంబన దొరుకుతుందనుకుంటే అతనికి దూరంగా ఉండండి. సైకియాట్రిస్టుని కలవండి. మార్పు వస్తే, కుటుంబ సభ్యుల మధ్య ఒప్పందం మేరకు కలిసుండవచ్చు. లేదంటే బిడ్డతో స్వతంత్రంగా ఉండొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్