వేధింపులకు గురవుతున్నారేమో..

లలిత కూతురు కాలేజీ నుంచి రావడమే.. గదిలోకి వెళ్లిపోతుంది. పిలిచినా పలకదు. ఎవరితోనూ ఏమీ చెప్పదు. ఏదో కోల్పోయినట్లుగా ఉంటుంది. ఈ తరహా ప్రవర్తన వేధింపులకు గురయ్యేవారిలోనూ కనిపిస్తుందంటున్నారు నిపుణులు. ఇవన్నీ వారి మానసిక సంఘర్షణకు సంకేతాలు కావొచ్చని హెచ్చరిస్తున్నారు.

Published : 04 Jul 2022 00:52 IST

లలిత కూతురు కాలేజీ నుంచి రావడమే.. గదిలోకి వెళ్లిపోతుంది. పిలిచినా పలకదు. ఎవరితోనూ ఏమీ చెప్పదు. ఏదో కోల్పోయినట్లుగా ఉంటుంది. ఈ తరహా ప్రవర్తన వేధింపులకు గురయ్యేవారిలోనూ కనిపిస్తుందంటున్నారు నిపుణులు. ఇవన్నీ వారి మానసిక సంఘర్షణకు సంకేతాలు కావొచ్చని హెచ్చరిస్తున్నారు.

ఇంట్లో అందరితో కలివిడిగా, సరదాగా ఉండే యుక్తవయసు పిల్లల ప్రవర్తనలో మార్పు కనిపిస్తే వెంటనే గుర్తించాలి. వేధింపులకు గురవుతున్నారేమోనని సందేహించాలి. తల్లిదండ్రులతో చెబితే ఈ అంశాన్ని వారెలా తీసుకుంటారో అనే భయం పిల్లలను పెదవి విప్పనివ్వదు. ఏ విషయమైనా తల్లిదండ్రులకు చెప్పగలిగేలా ఉండాలి. అంతటి సాన్నిహిత్యం పెద్దవాళ్లకు పిల్లలతో బాల్యం నుంచి ఉంటే మంచిది.

భరోసా..

ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటుతోపాటు పలకరిస్తేనే.. అరుస్తూ కోపాన్ని ప్రదర్శిస్తున్నారంటే పిల్లల మనసులో ఏదో వేదన గూడు కట్టుకొని ఉందని అర్థం చేసుకోవాలి. గతంలో ఎంతో ఆసక్తితో క్రీడలంటే ముందుకొచ్చే వాళ్లలో నిరాశక్తత కనిపించినా, ఇష్టమైనవారిని దూరం పెడుతున్నా.. కారణమేదో ఉందని గ్రహించాలి. అందరినీ నిందించడం, తమని తాము హింసించుకోవడం వంటివన్నీ వారి నిస్సహాయతను ప్రదర్శించేవే. తినకుండా, ఏదో కోల్పోయినట్లుంటే పెద్దవాళ్లు కోప్పడకూడదు.  అనునయంగా మాట్లాడి సమాచారాన్ని రాబట్టాలి. భయాన్ని పోగొట్టి, తామున్నామనే భరోసా, నమ్మకాన్ని తల్లిదండ్రులు కలిగించాలి.

పర్యవేక్షణ..

పిల్లలపట్ల పెద్దవాళ్లు సహనంగా ఉండాలి.  బయటివారు, స్నేహితులు, బంధువులవల్ల  బాధితులయ్యే ప్రమాదం ఉండొచ్చు. ఆ వ్యక్తులను గుర్తించడానికి, పిల్లలతో తమ మనసులోని వేదనను బయటకు చెబితేనే  తగిన పరిష్కారాన్ని అందించగలమనే నమ్మకాన్ని వారికి కలిగించాలి. తాము బాధితులమనే ఆలోచన నుంచి పిల్లలను బయటకు తేవాలి. ధైర్యంగా ఎదుర్కొనేలా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచగలిగితే, సమస్యకు సగం పరిష్కారం దొరికినట్లే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్