పాలు తాగనని మారాం చేస్తే..

‘ఏం చేసినా.. పాలు మాత్రం తాగించలేకపోతున్నా’.. చాలామంది అమ్మల ఫిర్యాదే ఇది. చిన్నారుల ఎదుగుదలలో ప్రధాన పాత్ర వహించేది క్యాల్షియం. ఇది పాల ద్వారా సమృద్ధిగా అందుతుంది.

Updated : 29 Feb 2024 17:12 IST

‘ఏం చేసినా.. పాలు మాత్రం తాగించలేకపోతున్నా’.. చాలామంది అమ్మల ఫిర్యాదే ఇది. చిన్నారుల ఎదుగుదలలో ప్రధాన పాత్ర వహించేది క్యాల్షియం. ఇది పాల ద్వారా సమృద్ధిగా అందుతుంది. మరి వీళ్లేమో తాగమంటున్నారు. మరి ప్రత్యామ్నాయం? ఇవిగో!

* సోయాబీన్‌, ఆకుకూరలు: సోయాలో క్యాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చండి. సోయాబీన్‌ టోఫూలు దొరుకుతున్నాయి. వాటినీ ఇవ్వచ్చు. పాలకూర, ఇతర ఆకు కూరల్లో క్యాల్షియం సమపాళ్లలో ఉంటుంది. వీటిని రోజుకు రెండుసార్లు తినిపిస్తే సరి.

* నారింజ, ఓట్స్‌: క్యాల్షియం అధిక మొత్తంలో ఉంటుంది. పిల్లలూ తినడానికి ఆసక్తి చూపుతారు. లేదంటే జ్యూస్‌ రూపంలో అయినా అందించొచ్చు. ఓట్స్‌లో విటమిన్‌ బి కూడా ఎక్కువగా ఉంటుంది. బాదం/ సోయా పాలతో చేసిపెడితే అదనపు ప్రయోజనం.

* నట్స్‌: డ్రైఫ్రూట్స్‌, గుమ్మడిగింజలు, అవిసెలు, పొద్దుతిరుగుడు విత్తనాలు వంటి వాటిల్లో క్యాల్షియం దండిగా ఉంటుంది. వీటిని స్నాక్స్‌, కారప్పొడి ఏ రూపంలో అయినా అందించొచ్చు. క్యాల్షియం గ్రహించుకోవడానికి పిల్లలకు తగినంత విటమిన్‌ డి కూడా తప్పనిసరే. రోజూ కొద్దిసేపు ఎండలో తిప్పడంతోపాటు ఇది ఎక్కువగా ఉండే గుడ్డు, సీఫుడ్‌నూ తరచుగా ఇస్తే మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్