నెలసరులపై దెబ్బ!

కొవిడ్‌ కారణంగా తలెత్తిన మానసిక ఒత్తిడి... మహిళల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బ తీసిందా? అవుననే అంటున్నాయి తాజా పరిశీలనలు. ఎడిన్‌బర్గ్‌లో జరిగిన సొసైటీ ఫర్‌ ఎండోక్రనాలజీ వార్షిక సదస్సులో నిపుణులు...

Updated : 23 Nov 2021 06:02 IST

కొవిడ్‌ కారణంగా తలెత్తిన మానసిక ఒత్తిడి... మహిళల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బ తీసిందా? అవుననే అంటున్నాయి తాజా పరిశీలనలు. ఎడిన్‌బర్గ్‌లో జరిగిన సొసైటీ ఫర్‌ ఎండోక్రనాలజీ వార్షిక సదస్సులో నిపుణులు వెల్లడించిన కొన్ని నివేదికలు ఈ విషయాన్ని రూఢీ చేశాయి. కొవిడ్‌ సమయంలో ఎదురైన తీవ్రమైన మానసిక ఒత్తిడి మహిళల నెలసరి క్రమాన్ని దెబ్బతీసిందని, ఇది సంతానోత్పత్తి సామర్థ్యంపై తీవ్రంగా పడిందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఆ సమయంలో ఎదుర్కొన్న నిద్రలేమి, ఒత్తిడి ఇందుకు మూలాలట. దీనికితోడు ఆహారనియమాలు గతి తప్పడం, తగినంత వ్యాయామం లేకపోవడం... హార్మోన్లని ప్రభావితం చేశాయి. ఇవన్నీ నెలసరి క్రమాన్ని మార్చేశాయని అంటున్నారు. డబ్లిన్‌కి చెందిన లిసాఓవెన్స్‌ ఆధ్వర్యంలో 1300 మంది మహిళలపై ఓ సర్వే జరిగింది. అందులో అరవైశాతం మంది మహిళలకు కొవిడ్‌ తర్వాత నుంచీ నెలసరులు సరిగా రావడం లేదు. అధిక బరువు, దాంపత్య జీవితంపై విముఖత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారట. దీనికి మానసిక స్థైర్యమే సరైన మందు అంటున్నారు వైద్యులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్