మామిడి... మరక మాయం!

మామిడి పండ్ల రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ వాటి మరకలూ మొండివే. వాటిని ఎలా తొలగించాలో చూద్దామా...

Updated : 15 Jun 2021 13:02 IST

మామిడి పండ్ల రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ వాటి మరకలూ మొండివే. వాటిని ఎలా తొలగించాలో చూద్దామా...
వెనిగర్‌... మరక పడిన చోట కాస్త వెనిగర్‌ వేసి కాసేపు పక్కన పెట్టాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. మరకలు సులువుగా వదిలిపోతాయి.
వంటసోడా... చల్లి కాసేపటి తర్వాత బ్రష్‌తో రుద్దాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేస్తే సరి.
టూత్‌పేస్ట్‌... ఇది కూడా మామిడి రసం మరకలను త్వరగా వదిలిస్తుంది. మరకపై పేస్ట్‌ రుద్ది పావుగంట తర్వాత వెచ్చటి నీటితో కడిగేయాలి.
బ్లీచ్‌... గోరువెచ్చని నీటిలో ఒకట్రెండు చెంచాల బ్లీచ్‌ వేసి ఆ నీటిని మరకపై పోయాలి. ఆ తర్వాత చేత్తో లేదా బ్రష్‌తో మరకపై రుద్దితే సరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్