ప్రొఫైల్‌లో ఇవి గమనించారా

కొంచెం అందమైన ఫొటో ఉంచినా.. సృజనాత్మక చూపించినా.. సామాజిక మాధ్యమాల్లో అమ్మాయిల ఖాతాలకు ఫ్రెండ్‌ రిక్వెస్టులు, అనుసరించేవారి సంఖ్య పెరుగుతుంటాయి. వారిలో కొందరి     ప్రవర్తన నచ్చి మాటా కలుపుతుంటారు. మరి ఆ స్నేహహస్తం సరైనదేనా? గమనించుకోండిలా..!

Updated : 03 Feb 2022 05:11 IST

కొంచెం అందమైన ఫొటో ఉంచినా.. సృజనాత్మక చూపించినా.. సామాజిక మాధ్యమాల్లో అమ్మాయిల ఖాతాలకు ఫ్రెండ్‌ రిక్వెస్టులు, అనుసరించేవారి సంఖ్య పెరుగుతుంటాయి. వారిలో కొందరి ప్రవర్తన నచ్చి మాటా కలుపుతుంటారు. మరి ఆ స్నేహహస్తం సరైనదేనా? గమనించుకోండిలా..!

నిజాయతీతో కూడిన వాళ్లే స్నేహితులవుతారని ఊహించలేం. కాబట్టి, భవిష్యత్‌ ప్రమాదాల నుంచి తప్పించుకోవాలంటే కొంత జాగ్రత్తతో ఉండటం మంచిదే. రిక్వెస్ట్‌/ మెసేజ్‌ పంపిన వారిని వెంటనే జోడించుకుంటూ వెళ్లకండి. వాళ్ల ప్రొఫైల్‌ని గమనించండి. కేవలం పేరు, ఫొటోలే ఉన్నాయా.. సంబంధిత వివరాలేమైనా ఉన్నాయా పరిశీలించండి. సొంత ఖాతాని ఎవరైనా.. అందంగా, ఆకర్షణీయంగా ఉండేలా చూసుకుంటారు. అలా కాకుండా అతి తక్కువ వివరాలున్నాయంటే అనుమానించాల్సిందే. అలాగే ఎన్ని రోజులుగా వాడుతున్నారు, అనుసరిస్తున్న వారి సంఖ్య, స్నేహితుల వివరాలనూ గమనించుకోవాలి.
సామాజిక మాధ్యమాలన్నాక ఫొటోలను షేర్‌ చేయడం మామూలే. ఖాతాకి ఉన్న ఫొటో మినహా వేరేవేవీ లేకపోయినా నకలుగా భావించండి. సరే.. చాలామందికి వ్యక్తిగత ఫొటోలుంచడం నచ్చదు. కానీ వేరే అంశాలపైనా ఆసక్తి లేకుండా ఉండదు కదా! అలా లేకపోతే అసలు ఖాతానే అనవసరం. కాబట్టి, దీన్నీ పరిగణనలోకి తీసుకోండి.
తమ గురించి తాము గొప్పలు చెప్పుకోవడం.. సంభాషణలన్నీ హోదా చుట్టూ, ఖరీదైన విషయాల చుట్టూనే తిరుగుతున్నా.. వాళ్లేదో దాయాలని చూస్తున్నట్లే. నిజమైన స్నేహం కావాలని చాలామందికి ఉంటుంది. కానీ తగినవాళ్లని ఎంచుకోవడమే ముఖ్యం. ఆన్‌లైన్‌ స్నేహాలు అనుకున్నంత ఆరోగ్యకరం కాకపోవచ్చు. కాబట్టి, వ్యక్తిగత వివరాలు, ఫొటోలు వంటివి పంచుకోకండి. ముఖ్యంగా మనసు అందిస్తున్న సంకేతాలను గమనించుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్