జింక్‌తో చుండ్రు దూరం...

శీతాకాలంలో చర్మం పొడిబారినట్లే మాడు కూడా ప్రభావితమవుతుంది. దీంతో దురద, చుండ్రు వంటివి మొదలై, శిరోజాలు రాలిపోతుంటాయి. దీనికి జింక్‌, బయోటిన్‌ ఉన్న పదార్థాలను ఆహారంలో చేర్చుకోమంటున్నారు నిపుణులు..  

Updated : 11 Jan 2022 05:37 IST

శీతాకాలంలో చర్మం పొడిబారినట్లే మాడు కూడా ప్రభావితమవుతుంది. దీంతో దురద, చుండ్రు వంటివి మొదలై, శిరోజాలు రాలిపోతుంటాయి. దీనికి జింక్‌, బయోటిన్‌ ఉన్న పదార్థాలను ఆహారంలో చేర్చుకోమంటున్నారు నిపుణులు..  

కోడిగుడ్డు, వేరుసెనగ, సోయాబీన్స్‌, తృణధాన్యాలు, ఆకుకూరలు, బఠానీలు, క్యాలీఫ్లవర్‌, అరటిపండుల్లో బయోటిన్‌ పుష్కలంగా ఉంటుంది. మాంసాహారం, గింజధాన్యాలు, పాల ఉత్పత్తులు వంటి వాటిలో జింక్‌ ఉంటుంది. వీటిని ప్రతి రోజూ ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడాలి. వీటిలోని ఈ ఖనిజ లవణాలతోపాటు విటమిన్లు మాడు పొడిబారే సమస్యను దూరంగా ఉంచుతాయి. అలాగే ఒమేగా 3 ఫాటీ ఆమ్లాలు జుట్టు, మాడును ఆరోగ్యంగా ఉంచుతాయి.

చక్కెరకు దూరంగా... రోజూ చక్కెర వీలైనంత తక్కువగా తీసుకుంటే మంచిది. ఇది చర్మాన్ని, జుట్టును ప్రభావితం చేస్తుంది. చక్కెరకు ప్రత్యామ్నాయంగా తేనె లేదా బెల్లం వినియోగించాలి. వారానికి రెండుమూడుసార్లు తలస్నానం చేస్తే మాడుపై మురికి చేరుకోకుండా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్