ఈ భాగాలకూ సన్‌స్క్రీన్‌!

బయటకు వెళ్లినప్పుడు సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకుంటాం. కానీ... ఇంట్లో ఉన్నప్పుడూ ఈ శరీర భాగాలకు తప్పనిసరిగా రాసుకోవాలట.

Updated : 29 Sep 2021 04:12 IST

బయటకు వెళ్లినప్పుడు సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకుంటాం. కానీ... ఇంట్లో ఉన్నప్పుడూ ఈ శరీర భాగాలకు తప్పనిసరిగా రాసుకోవాలట.

పెదాలు... ముఖానికి సన్‌స్క్రీన్‌ రాస్తాం. మరి పెదాలో? ఇవి చర్మం కంటే మృదువైనవి. కాబట్టి వీటికి పోషణ, రక్షణ తప్పనిసరి. ఇందు కోసం ఎస్‌పీఎఫ్‌ ఉండే లిప్‌బామ్‌ వాడాలి.

చెవులు... సూర్య కాంతి తగిలే ప్రతి శరీర భాగానికీ సన్‌స్క్రీన్‌ రాయాల్సిందే. అందుకే ఇకనుంచీ చెవులకూ రాయండి.

కనురెప్పలు... వృద్ధాప్య ఛాయలు మొదలైన వారిలో గీతలు, ముడతలు కంటి చుట్టే మొదట ప్రారంభమవుతాయి. కాబట్టి కనురెప్పలపైనా లోషన్‌ను ఇక్కడా రాసుకోవాల్సిందే.

పాదాలు... సాధారణంగా  చాలామంది ఫ్లిప్‌-ఫ్లాప్స్‌, సాండిల్స్‌ వేసుకుంటారు. ఇవి వేసుకున్నాం కాబట్టి సన్‌స్క్రీన్‌ లోషన్‌ అవసరం లేదనుకుంటారు. అయినా తప్పక క్రీమ్‌ రాయాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్