పిల్లలకు చెప్పాలి ఆహార పాఠాలు

చిన్నారులకు పోషకాహారం ఇవ్వడంతోపాటు దానిపై అవగాహనా కల్పించాలంటున్నారు ఆహార నిపుణులు. అది వారి భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుందంటున్నారు...

Updated : 09 Sep 2022 12:01 IST

చిన్నారులకు పోషకాహారం ఇవ్వడంతోపాటు దానిపై అవగాహనా కల్పించాలంటున్నారు ఆహార నిపుణులు. అది వారి భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుందంటున్నారు...

* ఎనిమిది నెలల నుంచే... పుట్టాక రెండేళ్లు నిండే వరకు చిన్నారులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. రెండేళ్లు నిండే వరకు తల్లిపాలు తీసుకునే చిన్నారులు పెద్దయ్యాక కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు అధ్యయనాలు తేల్చాయి. తల్లి పాలతో పాటు ఆరు నుంచి ఎనిమిది నెలలు నిండిన తర్వాత తేలికగా జీర్ణమయ్యే, పోషకాహారాన్ని ఇవ్వాలి. ఇది మెదడు ఎదుగుదలకు తోడ్పడుతుంది.
* పోషకాహార లోపాలు... బాల్యం నుంచి సరైన ఆహారం అందని చిన్నారుల్లో ఎ, డి విటమిన్లు, ఐరన్‌ తదితర పోషకాలు లోపిస్తాయి. దీంతో నేత్ర సమస్యలు, శక్తివిహీనంగా ఉండటం, రక్తహీనత, చదువుపై ఏకాగ్రత తగ్గడం వంటివి తలెత్తుతాయి. అలాకాకుండా ఉండాలంటే పిల్లలకు మంచి ఆహార అలవాట్లు చేయాలి. ఏ పదార్థాలు, కూరగాయలు శక్తినిస్తాయి అన్నది అవగాహన కలిగించాలి.
*చిట్కాలతో... పెద్దవాళ్లు తీసుకునే వాటినే పిల్లలు తినాలని బలవంతపెట్టకుండా, ఉదయం ఏదైనా ఒక పండు, గుప్పెడు నట్స్‌ తినిపిస్తే చాలు. రోజూ ఒకేరకమైన పదార్థాలు కాకుండా వాళ్ల ప్లేటును రంగురంగుల కూరగాయలు, పండ్లముక్కలతో నింపాలి. ఆకర్షణీయంగా ఉండటంతో ఆసక్తిగా తింటారు. తినేటప్పుడు కంగారు పెట్టకుండా, కాస్త ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఎప్పుడైనా తినకపోయినా దండించకూడదు. దానికి సమానమైన పోషకాలను మరోరూపంలో అందించాలి.
* వంటింట్లో... వంటలో పిల్లలను భాగస్వాములను చేయాలి. చిన్నచిన్న పనులు చేయించాలి. ఇవన్నీ ఆహారంపట్ల ఆసక్తిని పెంచుతాయి. రుచికరమైన ఆహారాన్ని వండటం, వృథా చేయకుండా తినడం నేర్చుకుంటారు. స్నాక్స్‌లో కూడా పోషక విలువలుండేవి అందించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్