మనసు తేలికపరచుకోండి!

ఆలోచనైనా, బాధైనా మనలో చాలా మందికి లోపలే దాచుకోవడం అలవాటు. చెబితే ఏమనుకుంటారో, హేళన చేస్తారేమోననే భయం. కానీ మాట్లాడండి. చిన్నచూపు చూస్తారనిపిస్తే జనరల్‌ అంశంగా అయినా చర్చించండి.

Updated : 28 Dec 2021 05:43 IST

పంచుకోండి.. ఆలోచనైనా, బాధైనా మనలో చాలా మందికి లోపలే దాచుకోవడం అలవాటు. చెబితే ఏమనుకుంటారో, హేళన చేస్తారేమోననే భయం. కానీ మాట్లాడండి. చిన్నచూపు చూస్తారనిపిస్తే జనరల్‌ అంశంగా అయినా చర్చించండి.

పెయింటింగ్‌.. అయ్యో నాకు రాదే! అనుకోకండి. పోటీలకేం వెళ్లడం లేదు. సరదాకి ప్రయత్నిస్తు న్నారంతే. తోచిందల్లా గీయండి. ఇది మనసును అనవసర విషయాలవైపు వెళ్లకుండా ఆపుతుంది. మనసునూ ప్రశాంతంగా ఉంచడం మీరే గమనిస్తారు.

ధ్యానం, సంగీతం.. వీటి గొప్పదనం ప్రయత్నిస్తేనే తెలుస్తుంది. తరచూ చేస్తోంటే మనసు తేలికవుతుంది. నచ్చిన సంగీతం వినొచ్చు.. శాస్త్రీయమే కావాల్సిన పని లేదు. అయితే విషాద గీతాలను మాత్రం వినొద్దు. హుషారైన, మనసును తేలికపరిచే సాహిత్యాలను ఎంచుకోవచ్చు. కాలూ కదిపితే ఇంకా మంచిది.

స్వీయ శ్రద్ధ.. అందంగా కనిపించడమూ ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఇక్కడ ఉద్దేశం మేకప్‌ వేసుకోమని కాదు. స్కిన్‌ కేర్‌, డ్రెసింగ్‌ మీద దృష్టిపెట్టండి. చిన్న చిన్న వ్యాయా మాలు చేయండి. నడక, చిన్న చిన్న స్ట్రెచెస్‌ సరిపోతాయి.

గార్డెనింగ్‌.. మానసికమే కాదు.. శారీరక సమస్యలకూ ఇది మంచి పరిష్కారం. తేలిగ్గా పెంచగలిగే మొక్కల్ని తెచ్చిపెట్టుకోండి. వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోండి. తేడా మీకే తెలుస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్