ఓ.. సారీ, థాంక్స్‌!

కొత్త సంవత్సరం వచ్చేస్తోందనగానే హుషారూ సంతోషాలూ సహజమే. చాలామంది ఇంటిని శుభ్రం చేయడం, కొత్త దుస్తులు, వస్తువులు కొనుక్కోవడం వంటివీ చేస్తారు. అవన్నీ సరే.. ఇంతకీ కొత్త ఆలోచనలేం చేశారు?

Updated : 29 Feb 2024 16:47 IST

కొత్త సంవత్సరం వచ్చేస్తోందనగానే హుషారూ సంతోషాలూ సహజమే. చాలామంది ఇంటిని శుభ్రం చేయడం, కొత్త దుస్తులు, వస్తువులు కొనుక్కోవడం వంటివీ చేస్తారు. అవన్నీ సరే.. ఇంతకీ కొత్త ఆలోచనలేం చేశారు?

రోజువారీ పనుల్లో పడి చాలామందిని పట్టించుకోకుండా యాంత్రికంగా సాగిపోతుంటాం. న్యూ ఇయర్‌ సందర్భంగా ఎంత చిన్న మంచిపని చేసిన వ్యక్తినయినా అభినందించాలని, మీతో ఆత్మీయంగా ఉండే ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పాలని నిర్ణయించుకోండి. ఇది అవతలి వ్యక్తిలో ఆనందాన్ని నింపుతుందని అర్థం చేసుకున్నారంటే ‘థాంక్స్‌’ అనే పదాన్ని మీరెన్నడూ వదిలిపెట్టరు. మిమ్మల్ని చూసి పిల్లలూ దాన్ని అనుసరిస్తారు.

* మీ వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే భేషజాలు లేకుండా క్షమాపణ అడగటం బాధ్యతగా స్వీకరించండి.. ‘సారీ’ కూడా మంత్రంలా మాయ చేసేస్తుంది. అవతలి వ్యక్తీ మీ పట్ల నిష్టూరాలు లేక ప్రేమగా ఉంటారు.

* ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లకు బానిసలయ్యారా? అవి మీ సమయాన్ని ఎంతగా తినేస్తున్నాయో కదా! ఈ కొత్త సంవత్సరం నుంచి రోజులో కొన్ని గంటలే వాటికి కేటాయిస్తానని మీకు మీరే ప్రమాణం చేసుకోండి.

* షాపింగ్‌ సరదాతో ఎప్పుడూ ఏదో ఒకటి కొనేస్తుంటారా? అయితే  దాని మీద కూడా అదుపు సాధించాల్సిందే! నయా సాల్‌ వేళ షాపింగ్‌ బడ్జెట్‌ ఇంత అని గట్టిగా నిశ్చయించుకోండి. దాన్ని మీరకండి. మనం జల్సా చేసే డబ్బుతో ఎవరినైనా ఆదుకోవచ్చేమో ఆలోచించండి. మనసుకీ తృప్తి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్