సంసారానికి సూత్రాలు పాటిస్తున్నారా?

ఆలుమగల అనుబంధం కలకాలం హాయిగా కొనసాగాలంటే ఇద్దరూ కొన్ని సంసార సూత్రాలను పాటించాల్సిందే.

Updated : 08 Feb 2022 05:54 IST

ఆలుమగల అనుబంధం కలకాలం హాయిగా కొనసాగాలంటే ఇద్దరూ కొన్ని సంసార సూత్రాలను పాటించాల్సిందే.

* చిన్న చిన్న అసంతృప్తులను పట్టించుకోవద్దు. కొన్ని విషయాల్లో ఎదుటివారిది తప్పైనా క్షమించడం నేర్చుకోండి. పనిని పంచుకోండి. అన్నింటినీ ఎదుటివారి భుజాలపై మోపొద్దు.

* అన్ని విషయాల్లో నాదే సాగాలన్న ధోరణి మంచిది కాదు. సర్దుకుపోతేనే జీవితం అనే విషయాన్ని గ్రహిస్తేనే కాపురం కలకాలం హాయిగా సాగిపోతుంది.

* అవతలి వ్యక్తికి నచ్చలేదని ఆసక్తి ఉన్న రంగాన్ని పక్కన పెట్టేయాల్సిన పనిలేదు. అప్పటికి బాగున్నా.. భవిష్యత్‌లో భాగస్వామిపై ద్వేషానికి కారణమవొచ్చు. కాబట్టి, తనతో కూర్చొని సామరస్యంగా మాట్లాడండి. నచ్చజెప్పే ప్రయత్నం చేయండి. తనకు ఇబ్బంది కలిగించే కారణాలను తెలుసుకుని వాటిని మార్చుకుంటానని భరోసానివ్వండి.

* వివాహమనేది ఆట కాదు... ఇరు వర్గాలు ఒకరికొకరు పోటిగా మార్కులు సంపాదించడానికి! మీరో మంచి పని చేసినప్పుడు ఎదుటివారూ చేయాలని ఆశించొద్దు. అలాగే ఏ సమస్య ఎదురైనా.. ‘నీవల్లే జరిగింది’ అంటూ ఒకరినొకరు కించపరుచుకోవద్దు. దాన్నుంచి బయటపడే మార్గాన్ని కలిసి అన్వేషించాలి.

* గృహిణి అయినా నేర్చుకోవడంపై దృష్టిపెట్టండి. నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి. మీవారికి అవసరమైతే పనిలో సహాయ సహకారాలు అందించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్