Updated : 16/03/2021 18:49 IST

జుట్టుకు గోరింటాకు! 

పోషకాహార లోపం, కాలుష్యం, ఒత్తిడి...  వీటన్నింటి ప్రభావం జుట్టుపై పడుతుంది. ఫలితంగా చుండ్రు, జుట్టు పొడిబారడం, రాలడం, నెరవడం.. లాంటి సమస్యలు వస్తాయి. వీటిని నియంత్రించాలంటే ఈ ప్రత్యేకమైన పూతలను ప్రయత్నించండి.
ఒత్తుగా పెరిగేందుకు.... గోరింటాకు పొడి (హెన్నా)లో కొద్దిగా ఆలివ్‌నూనె కలిపి రాత్రంతా నానబెట్టాలి. మర్నాడు కాస్తంత చక్కెరవేసి తలకు పట్టించాలి. రెండు గంటల తర్వాత కడిగేయాలి. చుండ్రు పోయేందుకు...

హెన్నాలో కాస్తంత టీపొడి, నీళ్లు పోసి ఏడెనిమిది గంటలపాటు ఉంచాలి. ఆ తర్వాత తలకు రాయాలి. ఇలా చేసే ముందు కొబ్బరినూనె రాసుకుంటే మంచిది.

నెరుపు తగ్గేందుకు... ఈ సమస్య తగ్గాలంటే... కాస్తంత గోరింటాకు పొడిలో కొద్దిగా మెంతిపొడి వేసి, కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి కాసేపు నానబెట్టాలి. ఆ తర్వాత జుట్టుకు పట్టించి గంటాగి కడిగేయాలి. దీన్ని క్రమం తప్పకుండా వేసుకోవడం వల్ల నెరుపు క్రమంగా తగ్గుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని