యాక్నే తగ్గించే కొబ్బరినూనె!

సహజంగా, సులభంగా లభించే కొబ్బరినూనెలో అందాన్ని మెరుగుపరిచే సుగుణాలూ ఉన్నాయి. దీనిలో ఉండే యాంటీబ్యాక్టీరియల్‌,....

Updated : 08 Jun 2021 04:14 IST

సహజంగా, సులభంగా లభించే కొబ్బరినూనెలో అందాన్ని మెరుగుపరిచే సుగుణాలూ ఉన్నాయి. దీనిలో ఉండే యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీఫంగల్‌ లక్షణాలు చర్మానికీ, జుట్టుకీ మేలు చేస్తాయి.

ర్మం నిర్జీవంగా పొడిబారినట్లు కనిపిస్తుంటే...అరకప్పు కొబ్బరినూనెలో గుప్పెడు గులాబీ రేకలు వేసి మరిగించండి. ఆపై చెంచా తేనె కలిపి ఒంటికి రాసుకుని కాసేపు మర్దన చేస్తే రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. పొడిబారే సమస్య అదుపులోకి వస్తుంది.
* గోరువెచ్చని కొబ్బరినూనెలో కొద్దిగా బేబీ ఆయిల్‌, రెండు చుక్కల గులాబీ నూనె కలిపి ఉదయాన్నే ముఖానికి రాయండి. కాసేపు మర్దన చేయండి. ఇది సహజ క్లెన్సర్‌లా పనిచేస్తుంది. యాక్నే తగ్గుముఖం పడుతుంది.
* జుట్టు ఆరోగ్యంగా, నల్లటి నిగారింపుతో మెరిసిపోవాలంటే కొబ్బరినూనెలో గుప్పెడు మందారపువ్వులు, చెంచా చొప్పున ఆముదం, ఆలివ్‌నూనె, కాసిన్ని మెంతులు వేసి మరిగించాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని కుదుళ్ల నుంచి చివర్లవరకూ రాసి మర్దన చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్