అందానికి యాపిల్‌!

ఏడాదంతా దొరికే పండ్లలో యాపిల్‌ ఒకటి. దీంట్లో పోషకాలు, యాంటీఆక్సిడెంట్‌ సమ్మేళనాలు మెండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్నిస్తాయి. అలాగే అందాన్నీ పెంచుతాయి.

Published : 12 Jul 2021 01:45 IST

ఏడాదంతా దొరికే పండ్లలో యాపిల్‌ ఒకటి. దీంట్లో పోషకాలు, యాంటీఆక్సిడెంట్‌ సమ్మేళనాలు మెండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్నిస్తాయి. అలాగే అందాన్నీ పెంచుతాయి. ఈ పండు పూత చర్మాన్ని మెరిపిస్తుంది. ఎలానో చూసేయండి మరి.

మృతకణాలు తొలగేలా... ఓ గిన్నెలో యాపిల్‌ పండు గుజ్జు, నిమ్మరసం, పెరుగు వేసి బాగా కలపాలి.  ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.  ఈ పూత వల్ల చర్మంపై పేరుకుపోయిన మురికి, మృతకణాలు తొలగిపోతాయి.  అలాగే దీన్ని తరచూ వేస్తూ ఉంటే మోముపై ఉండే ముడతలు, నల్లటి వలయాలు క్రమంగా తగ్గిపోతాయి. దాంతో ముఖం శుభ్రంగా, కాంతిమంతంగా మారుతుంది.

తక్షణ మెరుపునకు... రెండు చెంచాల యాపిల్‌ గుజ్జు, చెంచా చొప్పున పెరుగు, దానిమ్మ రసం... ఈ మూడింటిని కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. ఆరాక చల్లటి నీటితో కడిగితే సరి. సహజ సిద్ధపదార్థాలతో వేసిన ఈ పూత వల్ల చర్మం లోపలి నుంచి శుభ్రపడుతుంది. ఫలితంగా నల్లటి మచ్చలు, మొటిమలు తగ్గుముఖం పడతాయి. అంతేకాదు చిటికెలో మోము కాంతిమంతంగా మారుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్