వయసు దాచేయండి!

వయసు పెరిగే కొద్దీ ముఖంలో మార్పులు వస్తుంటాయి. కళ్ల కింద నల్లటి చారలు, వలయాలు, ముడతలు... ఇలా. వీటిని కనిపించకుండా చేయాలంటే... ఈ మెలకువలు తెలుసుకోవాలి....

Published : 23 Jul 2021 01:07 IST

వయసు పెరిగే కొద్దీ ముఖంలో మార్పులు వస్తుంటాయి. కళ్ల కింద నల్లటి చారలు, వలయాలు, ముడతలు... ఇలా. వీటిని కనిపించకుండా చేయాలంటే... ఈ మెలకువలు తెలుసుకోవాలి....

ముఖం మీద మచ్చలు ఉన్నప్పుడు మేకప్‌ కోసం లిక్విడ్‌ ఫౌండేషన్‌ రాసుకోవాలి. ఆ తర్వాత కూడా అవి కనిపిస్తూ ఉంటే కన్సీలర్‌తో అక్కడక్కడా చుక్కల్లా పెట్టి సమస్య ఉన్న చోట రాస్తే సరి.

* కళ్లకు మేకప్‌ వేసుకునే ముందు ఐస్‌ ముక్కని ఒక శుభ్రమైన వస్త్రంలో ఉంచి కళ్ల కింద రాయాలి. దీంతో అవి తాజాగా కనిపిస్తాయి. కళ్ల కింద వలయాలు కనిపించకుండా కొద్దిగా ఐక్రీమ్‌ రాసుకోవాలి. ఆపై కన్సీలర్‌తో అవసరమనుకున్న చోట్ల సరిచేస్తే చాలు.

* ముఖం మీద తెరుచుకున్న గంథ్రులు కనిపించకుండా మేకప్‌ వేసే ముందు ఐస్‌ముక్కలతో శుభ్రం చేయాలి. ఆపై లిక్విడ్‌ ఫౌండేషన్‌ రాసి దానిపై ట్రాన్స్కులెంట్‌ పౌడర్‌ రాస్తే చాలు. ముఖం చక్కగా కనిపిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్