చేతుల కింద నలుపు తగ్గిద్దాం!

కొందరమ్మాయిలను చేతుల కింద నలుపుదనం ఇబ్బందిపెడుతుంది. దాంతో పొట్టిచేతుల బ్లవుజులు, స్లీవ్‌లెస్‌ టాపులు వేసుకోలేకపోతున్నాం అని తెగ ఇబ్బంది పడుతుంటారు.

Published : 26 Jul 2021 01:13 IST

కొందరమ్మాయిలను చేతుల కింద నలుపుదనం ఇబ్బందిపెడుతుంది. దాంతో పొట్టిచేతుల బ్లవుజులు, స్లీవ్‌లెస్‌ టాపులు వేసుకోలేకపోతున్నాం అని తెగ ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారు ఈ జాగ్రత్తలు తీసుకుంటూ, చిట్కాలు పాటిస్తే ఈ సమస్య దూరమవుతుంది.

రోజూ స్నానానికి వెళ్లే ముందు అరచెక్క నిమ్మచెక్కకు కాస్త పంచదార అద్ది...ఆ ప్రదేశంలో రుద్దండి. ఇలా చేయడంవల్ల నిమ్మలోని సహజ బ్లీచింగ్‌ ఏజెంట్లు చర్మం ఛాయను మెరుగుపరుస్తాయి.

* కాలం ఏదైనా రోజూ మాయిశ్చరైజర్‌ రాసుకోవడం మానొద్దు. అలానే అవాంఛిత రోమాల్ని తొలగించడానికి త్రెడ్డింగ్‌, షేవింగ్‌...లాంటివి కాకుండా వ్యాక్సింగ్‌ని ప్రయత్నిస్తే సమస్య కొంతవరకూ అదుపులో ఉంటుంది.

* సమాన పరిమాణంలో ఆలివ్‌ నూనె, బ్రౌన్‌ షుగర్‌, చెంచా నిమ్మరసం కలిపి అక్కడి చర్మంపై ప్యాక్‌ వేయండి. కాసేపాగి చల్లటి నీటితో కడిగేయండి. ఇలా తరచూ చేస్తుంటే...పరిష్కారం కనిపిస్తుంది.

* రెండు టేబుల్‌ స్పూన్ల ఆపిల్‌ సిడార్‌ వెనిగర్‌లో చెంచా వంటసోడా కలిపి బాహుమూలల్లో, మోచేతులు, మెడ మీద రాస్తే...నల్లని చర్మం రంగు మారుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్