కళ్లను మెరిపిద్దాం!

ముఖారవిందానికి నేత్రసౌందర్యం కలిస్తే ఆ అందం రెట్టింపు అవుతుంది. కాటుక లేకుండానే రెప్పలపై మేకప్‌ ప్రస్తుతం నయాట్రెండ్‌గా మారింది.  మేకప్‌లో ఐలైనర్‌తోనే మ్యాజిక్‌ చేయొచ్చు. పెన్‌, పెన్సిల్‌, లిక్విడ్‌, జెల్‌ రకాల్లో, పలు వర్ణాల్లో ఐలైనర్‌లు లభ్యమవుతున్నాయి. రసాయన రహితంగా ఎకోఫ్రెండ్లీగా ఉన్న వాటినే ఎంచుకోవడం మంచిది. వీటితో సునాయసంగా కావాల్సిన ఆకారంలో రెప్పలపై ఒంపైన పూరెక్కలను తీర్చిదిద్దుకోవచ్చు.

Updated : 01 Aug 2021 05:33 IST

ముఖారవిందానికి నేత్రసౌందర్యం కలిస్తే ఆ అందం రెట్టింపు అవుతుంది. కాటుక లేకుండానే రెప్పలపై మేకప్‌ ప్రస్తుతం నయాట్రెండ్‌గా మారింది.

మేకప్‌లో ఐలైనర్‌తోనే మ్యాజిక్‌ చేయొచ్చు. పెన్‌, పెన్సిల్‌, లిక్విడ్‌, జెల్‌ రకాల్లో, పలు వర్ణాల్లో ఐలైనర్‌లు లభ్యమవుతున్నాయి. రసాయన రహితంగా ఎకోఫ్రెండ్లీగా ఉన్న వాటినే ఎంచుకోవడం మంచిది. వీటితో సునాయసంగా కావాల్సిన ఆకారంలో రెప్పలపై ఒంపైన పూరెక్కలను తీర్చిదిద్దుకోవచ్చు.

చివర్లలో

కంటి పరిమాణం చిన్నదైనా ఈ తరహా మేకప్‌తో నేత్రసౌందర్యాన్ని పెంచుకోవచ్చు. కనురెప్పపై కంటి మూలనుంచి మృదువుగా పెన్సిల్‌ లేదా పెన్‌తో చివరివరకు సన్నని గీత గీయాలి. ఇది కనుబొమ్మలతో సమానంగా వచ్చేలా చూసుకుంటే చాలు. కనులు తెరిచేటప్పుడు ఒత్తైన రెప్పలతో చూడటానికి విశాలంగా అనిపిస్తాయి.

లిక్విడ్‌తో

రెప్పలపై సన్నని బ్రష్‌తో లిక్విడ్‌ లేదా జెల్‌ను ఉపయోగించి వెడల్పుగా రేకలు గీయాలి. కంటికిరువైపులా మూలలకు వచ్చే సరికి ఇవి సన్నగా ఉండాలి. ఈ మేకప్‌ కంటిని విశాలంగా కనిపించేలా చేస్తుంది. అలాగే గ్రాఫిక్‌ డిజైన్‌లా రెప్పకు పైభాగంలో సన్నగా వంపుగా వచ్చేలా మరొక గీతను కలిపితే చాలు. దీంతో కంటి ఆకారం మరింత ఆకర్షణీయమవుతుంది. రంగుల ఐలైనర్‌ను ఎంపిక చేసుకునేటప్పుడు లేత లేదా ముదురు వర్ణాన్ని దుస్తులకు తగ్గట్లుగా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో వీటిని కాంట్రాస్ట్‌గానూ ఎంచుకోవచ్చు. ముందుగా నలుపు పెన్సిల్‌తో రెప్పలపై లైనింగ్‌ ఇచ్చి, దానిపైన ఎంచుకున్న రంగు ఐలైనర్‌తో ఫినిషింగ్‌ లైన్‌ ఇస్తే చాలు. కంటికి కొత్త అందం వచ్చినట్లే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్