కురుల సొగసుకు కావాలీ నూనెలు

జడ, ముడి, పోనీ.. ఏదైనా సరే.. ముఖానికి అందాన్నిచ్చేది కురులే. అందుకే మహిళలకు కురులంటే మహా ఇష్టం. మరి అంత ముఖ్యమైన జుట్టు రాలిపోకుండా, పొడిబారకుండా...

Updated : 04 Aug 2021 04:15 IST

జడ, ముడి, పోనీ.. ఏదైనా సరే.. ముఖానికి అందాన్నిచ్చేది కురులే. అందుకే మహిళలకు కురులంటే మహా ఇష్టం. మరి అంత ముఖ్యమైన జుట్టు రాలిపోకుండా, పొడిబారకుండా ఈ చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే మహత్తర ఫలితాలు పొందొచ్చు...

ఉసిరి, శీకాయ పొడులు రెండేసి చెంచాలు నీళ్లతో కలిపి తలకు పట్టించి ఓ గంట తర్వాత తలంటుకుంటే జుట్టు చిట్లదు.

* కొబ్బరినూనెలో ఆమ్లాపొడి వేసి మరిగించి చల్లారాక తలకు మర్దనా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

* ఉసిరిలో సి విటమిన్‌, గాలిక్‌ యాసిడ్‌, కెరొటిన్‌లుంటాయి. ఈ పొడిని తేనెలో కలిపి తినడంవల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. రక్తప్రసరణ బాగుంటుంది. అలా కురులు ఆరోగ్యంగా ఉంటాయి.

* దవనం, మరువంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. వీటిని తలలో పెట్టుకోవడం లేదా కొబ్బరి నూనెలో వేసి మరిగించి చల్లారిన తర్వాత తలకు రాసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు గట్టిపడతాయి.

* కొబ్బరిని తురిమి పాలు తీసి కుదుళ్లకు పట్టించి గంట తర్వాత తలంటుకుంటే జుట్టు రాలదు. వారానికొకసారి చొప్పున నాలుగు నెలలు చేయండి, మీకే తెలుస్తుంది.

* ఆముదంలో ఉండే ఇ-విటమిన్‌, రిసినోలిక్‌ యాసిడ్‌, ఒమేగా6 తదితరాలు వెంట్రుకలని చిట్లనివ్వవు. దృఢంగానూ ఉంచుతాయి.

* వెంట్రుకలు మరీ పల్చబారి పోతోంటే అరటిపండు గుజ్జు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయండి. ఇలా ఆరు వారాలు చేస్తే సరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్