ట్యాన్‌ తగ్గించే టొమాటో

పేరుకి వర్షాకాలమే అయినా.. ఎండ వేడిమితో ఆ విషయాన్నే మర్చిపోయాం. పని మీద బయటికి వెళ్లే అమ్మాయిలకి టాన్‌ భయం అదనం. దీన్ని ఇంట్లోనే సులువుగా పరిష్కరించుకోవచ్చు.చెంచా కీరా రసంలో అరచెంచా పాలు కలిపి ముఖానికి పట్టించి, ఇరవై నిమిషాల తర్వాత కడిగేయండి. టాన్‌ పోవడమే కాదు ముఖానికి తగినంత తేమా అందుతుంది....

Published : 14 Aug 2021 00:32 IST

పేరుకి వర్షాకాలమే అయినా.. ఎండ వేడిమితో ఆ విషయాన్నే మర్చిపోయాం. పని మీద బయటికి వెళ్లే అమ్మాయిలకి టాన్‌ భయం అదనం. దీన్ని ఇంట్లోనే సులువుగా పరిష్కరించుకోవచ్చు.

చెంచా కీరా రసంలో అరచెంచా పాలు కలిపి ముఖానికి పట్టించి, ఇరవై నిమిషాల తర్వాత కడిగేయండి. టాన్‌ పోవడమే కాదు ముఖానికి తగినంత తేమా అందుతుంది.

పావుకప్పు ఓట్‌మీల్‌లో తగినంత మజ్జిగ కలిపి మెత్తని పేస్టుగా చేసి ట్యాన్‌ ఉన్న చోట మందంగా పూసి, ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

తాజా టొమాటో రసాన్ని నేరుగా రాసినా ఫలితం ఉంటుంది

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్