హెన్నా పెడదామా!

వాతావరణంలో మార్పులు, పోషకాల లేమి, రసాయన ఉత్పత్తుల వాడకం, ఒత్తిడి వంటివన్నీ జుట్టుపై ప్రభావం చూపిస్తాయి. అలా జరగకూడదంటే నెలకోసారైనా ఈ హెన్నా ప్యాక్‌లను ప్రయత్నించండి.

Published : 16 Aug 2021 01:11 IST

వాతావరణంలో మార్పులు, పోషకాల లేమి, రసాయన ఉత్పత్తుల వాడకం, ఒత్తిడి వంటివన్నీ జుట్టుపై ప్రభావం చూపిస్తాయి. అలా జరగకూడదంటే నెలకోసారైనా ఈ హెన్నా ప్యాక్‌లను ప్రయత్నించండి.

* గోరింటాకు-కలబంద: గోరింటాకులో కాస్త ఆలివ్‌ నూనె, చెంచా నిమ్మరసం వేసి నానబెట్టాలి. ఉదయాన్నే కప్పు కలబంద, కొద్దిగా పెరుగు జతచేసి తలకు ప్యాక్‌ వేయాలి. ఓ గంట ఆరనిచ్చి తలస్నానం చేయాలి.

* మెహెందీ-మెంతి: గోరింటాకు జుట్టుకి పోషణ ఇస్తుంది. రంగు మారకుండా, వెంట్రుకలు రాలకుండా చేస్తుంది. ఇదొక్కటే పూత వేస్తే వెంట్రుకలు పొడిబారతాయి. హెన్నాకు, కప్పు మెంతి రసం కలపండి. దానికోపావు కప్పు పెరుగు చేర్చి ప్యాక్‌ వేస్తే... జుట్టు పట్టులా నిగనిగలాడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్