చివర్లు చిట్లకుండా!

జుట్టు తడిగా ఉన్నప్పుడే పడుకోవడం, గట్టిగా ఉండే దుప్పట్లు, దిండ్లు, కాలుష్యం, పోషకలేమి, సౌందర్య ఉత్పత్తులు, సాధనాలు, సంరక్షణ లేకపోవడం... ఇలా జుట్టు చిట్లడానికి బోలెడు కారణాలు...

Published : 17 Aug 2021 01:43 IST

జుట్టు తడిగా ఉన్నప్పుడే పడుకోవడం, గట్టిగా ఉండే దుప్పట్లు, దిండ్లు, కాలుష్యం, పోషకలేమి, సౌందర్య ఉత్పత్తులు, సాధనాలు, సంరక్షణ లేకపోవడం... ఇలా జుట్టు చిట్లడానికి బోలెడు కారణాలు...

కురులు ఆరోగ్యంగా, చిట్లకుండా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలి. ముఖ్యంగా ప్రొటీన్‌, ఇనుము, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలున్న పదార్థాలను తీసుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు, ఆకు కూరలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.

* జుట్టుకు తప్పనిసరిగా పూతలు, కండిషనర్‌ వాడాల్సిందే. పూతలు కేశాలకు కావాల్సిన పోషణను అందించి తేమగా ఉంచుతాయి. మూడు నెలలకోసారి జుట్టు చివర్లను కత్తిరిస్తూ ఉండాలి.

* తేనె, పెరుగు, అరటిపండు, బొప్పాయిలతో పూతలను ఇంట్లోనే ప్రయత్నించొచ్చు. వీటిని జుట్టుకు పట్టించి ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి. షాంపూ చేసుకున్నాక కండిషనర్‌ వాడటం మరవొద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్