ముత్యమంతా పసుపు...

శుభ సూచికగా పూజల్లోనూ, వంటింట్లోనూ వాడే పసుపులో సహజ ఔషధ గుణాలెన్నో పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల ఆరోగ్యానికే కాదు... అందానికీ బోలెడంత మేలు. మొటిమలు వాటి తాలూకు మచ్చలు చర్మాన్ని కాంతివిహీనంగా చేస్తాయి. ఇలాంటప్పుడు చెంచా పసుపు, రెండు చెంచాల గంధం పొడికి, కాసిన్ని పాలు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి...

Published : 01 Sep 2021 01:14 IST

శుభ సూచికగా పూజల్లోనూ, వంటింట్లోనూ వాడే పసుపులో సహజ ఔషధ గుణాలెన్నో పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల ఆరోగ్యానికే కాదు... అందానికీ బోలెడంత మేలు.

మొటిమలు వాటి తాలూకు మచ్చలు చర్మాన్ని కాంతివిహీనంగా చేస్తాయి. ఇలాంటప్పుడు చెంచా పసుపు, రెండు చెంచాల గంధం పొడికి, కాసిన్ని పాలు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో ముఖానికి ప్యాక్‌ వేసుకుని ఓ అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరి. మోము మెరిసిపోతుంది. పసుపులో ఉండే యాంటీ సెప్టిక్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఆ కారకాలతో పోరాడతాయి.

ముఖానికి ట్యాన్‌ పట్టినప్పుడు... కొద్దిగా పసుపు, చెంచా చొప్పున గులాబీపొడి, పెసరపిండిని తీసుకుని రోజ్‌వాటర్‌ కలిపి...పేస్ట్‌లా చేయాలి. దీన్ని రాత్రిళ్లు ప్యాక్‌ వేసి ఆరనిచ్చి కడిగేస్తే... ఉదయానికి ముఖం తాజాగా కనిపిస్తుంది.

కప్పు పెసరపిండిలో చిటికెడు పసుపు, అరకప్పు బొప్పాయి గుజ్జు, చెంచా గులాబీరేకల పొడి వేసి మెత్తగా పేస్ట్‌ చేయాలి. దీన్ని ముఖం, మెడ, చేతులకు రాసుకుంటే సరి. అరగంట తర్వాత కడిగితే... చర్మం మృదువుగా కనిపిస్తుంది. క్రమం తప్పకుండా ఇలా చేస్తే... ముడతలు, మృతకణాలు పోయి చర్మఛాయ మెరుగుపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్