లావణ్య అందానికి.. ఇవే మార్గాలట!

సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి తన చర్మ సంరక్షణకు ఇంటి చిట్కాలనే ఉపయోగిస్తుందట. ‘సెనగ పిండిలో పెరుగు, చిటికెడు పసుపు, కొన్ని చుక్కల రోజ్‌వాటర్‌ కలిపి ముఖానికి రాస్తాను. చిన్నప్పటి

Updated : 15 Sep 2021 04:58 IST

సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి తన చర్మ సంరక్షణకు ఇంటి చిట్కాలనే ఉపయోగిస్తుందట. ‘సెనగ పిండిలో పెరుగు, చిటికెడు పసుపు, కొన్ని చుక్కల రోజ్‌వాటర్‌ కలిపి ముఖానికి రాస్తాను. చిన్నప్పటి నుంచీ డ్యాన్స్‌, స్పోర్ట్స్‌తో ఎప్పుడూ బిజిగా ఉండే నాకు ఇది ట్యాన్‌ను దూరం చేయడంతో పాటు మెరుపునీ ఇచ్చేది. నిమ్మరసంలో బేకింగ్‌ సోడా కూడా బాగా పనిచేస్తుంది. వంట చేయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆ సమయంలో కోసే టొమాటో, నిమ్మకాయ, దోస వంటి వాటిని ముఖానికి రుద్దేస్తా. వీటి ద్వారా అందే సహజ పోషకాలను ఏ ప్రొడక్ట్‌ ఇవ్వలేవు. బియ్యప్పిండిలో చిటికెడు దాల్చినచెక్క పొడి, రోజ్‌వాటర్‌ కలిపి రాస్తా. ముఖానికి నునుపుతోపాటు స్వచ్ఛమైన గులాబీ మెరుపు వస్తుంది. ఓట్‌మీల్‌, నారింజ తొక్కల పొడి మిశ్రమం స్క్రబ్‌గా ఉపయోగిస్తా అని చెబుతోంది లావణ్య త్రిపాఠి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్