Updated : 16/09/2021 04:48 IST

పూసలకు.. కాసులు

పట్టుచీర కట్టుకుని, నుదుటిన పెద్దబొట్టూ, మెడలో కాసులపేరు.. చూస్తుంటే లక్ష్మీదేవే అలా నడిచొస్తున్నట్లు ఉండదూ! ఆ సంప్రదాయ హారాన్ని చూసి.. ఆధునిక అమ్మాయిల మనసు చిన్నబోతుందేమో అనుకున్నట్లున్నారు డిజైనర్లు. ‘కాసులంటే.. పట్టుచీరల కోసమేనా? ఆధునిక వస్త్రాలకూ వేసుకోవచ్చు’ అని రుజువు చేస్తున్నారు. మోడర్న్‌ మహాలక్ష్ములకు నప్పేలా ముత్యాల నుంచి ఎమరాల్డ్స్‌, రూబీ, పగడాలు, నల్లపూసల వరకు అన్నింటికీ కాసులను జతచేసేశారు. ఏ దుస్తులకైనా సరిగ్గా సరిపోతాయనిపించేలా తయారు చేసిన వీటిలో మీ మనసు దోచినవేవి?


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని