అందమైన అధరాలకు...

ఆరోగ్యమైన చర్మం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటాం. చక్కని ముఖంలో పెదవులదీ ప్రధాన పాత్రే. వాటిని అశ్రద్ధ చేస్తే.. అందం పూర్తవదు. వాటి విషయంలోనూ శ్రద్ధ చూపండిలా!

Updated : 25 Sep 2021 05:33 IST

ఆరోగ్యమైన చర్మం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటాం. చక్కని ముఖంలో పెదవులదీ ప్రధాన పాత్రే. వాటిని అశ్రద్ధ చేస్తే.. అందం పూర్తవదు. వాటి విషయంలోనూ శ్రద్ధ చూపండిలా!

పెదాలపై నూనె గ్రంథులుండవు. కాబట్టి, వాటికి తగిన తేమ మనమే అందించాలి. దీని చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కొలాజెన్‌ తగ్గితే త్వరగా ముడతలు పడుతుంది. ఇందుకు ఎస్‌పీఎఫ్‌ 30 లిప్‌బామ్‌ను తప్పక వాడాలి. అలాగే దీనిలో షియా బటర్‌, విటమిన్‌ ఇ, జొజొబా, కొబ్బరి, రోజ్‌/ లావెండర్‌ నూనెలు, బీ వ్యాక్స్‌ వంటివి ఉండేలా చూసుకోండి. 

* ఆరోగ్యమైన, సహజ రంగులో అధరాలుండాలంటే వారానికోసారి గ్లిజరిన్‌లో నిమ్మరసం కలిపి పెదాలకు రాయండి. మృతకణాలను తొలగించడంతోపాటు మంచి రంగూ వస్తుంది. స్పూను తేనెలో పంచదారను కలిపి సున్నితంగా రుద్దినా ఫలితముంటుంది. లిప్‌స్టిక్‌ అలవాటున్న వాళ్లు మొదట లిప్‌బామ్‌ రాశాకే దాన్ని పూతగా వేయండి. ఫలితంగా పెదాలు పొడారవు.

* అలర్జీలు, ఎండపొడ, ఐరన్‌ లోపం మొదలైనవి పాలిన పెదాలకు కారణమవుతాయి. వీటికి తగిన చికిత్సతోపాటు మంచి లిప్‌స్క్రబ్‌ వాడాలి. అలోవెరా గుజ్జును పెదాలకు రాసి, పది నిమిషాల తర్వాత కడిగేసినా ఫలితముంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్