మాస్క్‌తో.. మేకప్‌!

వరుసగా పండుగలు, వేడుకలు.. అందంగా ముస్తాబై కనిపించాలని ఎవరికుండదు? కానీ మాస్కులేమో తీయలేని పరిస్థితి. వాటితోనూ ట్రెండీగా కనిపించొచ్చు. ఎలాగో చదివేయండి.

Updated : 26 Sep 2021 05:08 IST

వరుసగా పండుగలు, వేడుకలు.. అందంగా ముస్తాబై కనిపించాలని ఎవరికుండదు? కానీ మాస్కులేమో తీయలేని పరిస్థితి. వాటితోనూ ట్రెండీగా కనిపించొచ్చు. ఎలాగో చదివేయండి.

ర్జికల్‌ మాస్క్‌లనే వాడండి. ఇవి మేకప్‌ను పీల్చుకోవు. అలాగే దట్టంగా మేకప్‌ వేయొద్దు. తేలిక పాటి ఫౌండేషన్‌తోపాటు కొంత పౌడర్‌ అద్దితే చాలు. ఐ మేకప్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. క్రీమ్‌ బ్లష్‌కు బదులు పౌడర్‌ తరహావి ఎంచుకోండి.

* గ్లాసీ లిప్‌స్టిక్‌ కాకుండా మ్యాటే లిప్‌కలర్‌ని ప్రయత్నించండి. చెరిగిపోదు. లిప్‌స్టిక్‌ వేసేముందు పెదాలకు మ్యాటే ఫౌండేషన్‌ను రాయండి. అలాగే మాస్క్‌ను పెట్టుకునే ముందు టిష్యూతో పెదాలను సున్నితంగా అద్దాలి. లిప్‌లైనర్‌ను తప్పక వాడాలి. లిప్‌బామ్‌నూ రాస్తే పెదాలు తేమను కోల్పోవు.

* పొడవైన స్ట్రాప్స్‌ ఉన్న మాస్కులను పెట్టుకుంటే చెవి జుంకాలు పట్టేస్తాయన్న భయముండదు.  వీలైనంత వరకూ హూప్స్‌ వంటివి కాకుండా దిద్దుల తరహా వాటికి ప్రాధాన్యమిస్తే ఇంకా మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్