Updated : 30/09/2021 02:05 IST

నవ వధువుకు మధుర జ్ఞాపకం

పచ్చని పందిరికింద మేళతాళాలు వాయిస్తుంటే,  వేదమంత్రాల మధ్య మనసుకు నచ్చినవాడితో మూడుముళ్లు వేయించుకునే ఆ క్షణం ప్రతి ఆడపిల్లకు జీవితంలో మరవలేని అనుభూతి. అంతటి అపురూపమైన సమయంలో ఆ వేదికపై ఉంచే ప్రతి వస్తువూ మనువాడే ఆ నవవధువుకు మధురమైన జ్ఞాపకమే. అవే ఈ డెకరేటింగ్‌ ప్లేట్స్‌. పండ్లు, పువ్వులు, కొబ్బరిబొండాలు, తమలపాకులతో సంప్రదాయాన్ని మేళవించి ప్లేట్లలో చేసే ఈ అలంకరణకు మధ్య ఉంచే వధూవరుల బొమ్మలు కళ్యాణవేదికకు ఓ ప్రత్యేకతనే అందిస్తున్నాయి. వివాహవేడుకలో భాగమవుతున్న ఈ కొత్తట్రెండ్‌ను మీరూ ఫాలో అయిపోండి.

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని