Updated : 08/10/2021 04:24 IST

బ్లాక్‌ హెడ్స్‌ తొలగిద్దాం

చాలామంది అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యల్లో బ్లాక్‌ హెడ్స్‌ ఒకటి. ఇంట్లో పదార్థాలతో వీటిని సులువుగా ఎలా తగ్గించుకోవచ్చో చూద్దామా..

రోజులో తప్పనిసరిగా రెండు మూడుసార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యాయామం చేసిన తర్వాత తప్పక కడుక్కోవాలి. ఆయిల్‌ ఫ్రీ సన్‌స్క్రీన్‌ లోషన్‌ను రాసుకోవాలి. మృతకణాలను ఎప్పటికప్పుడు తొలగించి, అవిరి పట్టడం మేలు. ఇవన్నీ చేస్తూనే... ఈ ప్యాక్‌లూ ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది.

* చక్కెర- బాదం నూనె... అర కప్పు చక్కెరలో రెండు చెంచాల బాదం నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలుంటాయి.
* గుడ్డు-నిమ్మరసం.. దీంట్లో రెండు చెంచాల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి మృదువుగా మర్దన చేయాలి. అది అరిపోయిన తర్వాత మరోసారి ప్యాక్‌ వేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
* తేనె-ఉప్పు... నిమ్మరసం మోముపై మురికిని తొలగిస్తే ఉప్పు స్క్రబ్‌లా పనిచేస్తుంది. తేనె చర్మానికి పోషణనిచ్చి మెరిపిస్తుంది. అయిదు నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. వారంలో రెండుమూడుసార్లు చేస్తే సరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని