Updated : 12/10/2021 05:31 IST

మాడుకు కాఫీ!

కాస్త సమయం, మరికాస్త సహనం ఉంటే వంటింట్లో ఉండే పదార్థాలతో అందాన్ని మెరిపించుకోవచ్చు... అదెలానో చూద్దామా...

బాదం, కొబ్బరి నూనెలను కలిపి తలకు పట్టించి మర్దనా చేయాలి. ఇలా తరచూ చేస్తే మాడుకు సరిగా రక్తప్రసరణ జరిగి జుట్టు బాగా పెరుగుతుంది.  నెరవదు కూడా.

* ఉసిరిని కచ్చాపచ్చాగా దంచి పాలలో కలిపి రోజంతా నానబెట్టాలి. ఆ తర్వాత తలకు పట్టించాలి. ఇలా వారంలో మూడు సార్లు చేస్తే జుట్టు బలంగా పెరుగుతుంది.

జుట్టుకు పెరుగు పూత వేసుకుంటే కావాల్సిన ప్రొటీన్లు అంది దృఢంగా తయారవుతుంది.

* టీ, కాఫీ పొడులను మాడుపై వేసి రుద్ది, ఆ తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే వెంట్రుకలు నెరవవు.

* ఇతరుల దువ్వెన వాడొద్దు. ఎవరి దువ్వెన వారికే ఉండాలి.

* నిమ్మ తొక్కలతో చేతులపై రుద్ది కాసేపయ్యాక చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే నలుపుదనం పోతుంది.

* పగిలిన పాదాలకు నిమ్మరసం పట్టించి కాసేపు మర్దనా చేసి కడిగేయాలి. ఆ తర్వాత పాలు లేదా క్రీమ్‌ అప్లై చేస్తే సరి. ఇలా చేస్తూ ఉంటే పగుళ్లు తగ్గి అక్కడి చర్మం మృదువుగా మారుతుంది.

* పావుకప్పు ఆలివ్‌ నూనెలో నాలుగైదు చుక్కల నిమ్మరసం కలిపి గోళ్లను అందులో ముంచాలి. ఇలా చేస్తే అవి అందంగా, ఆరోగ్యంగా మారతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని