పండగవేళ మెరిసిపోదామిలా!
బుగ్గల్లో కెంపులు విరబూస్తూ... పట్టుతో పోటీపడే జుట్టుమెరుపుతో పండగపూట సమ్‌థింగ్ స్పెషల్‌గా మెరిసిపోవాలని ఏ అమ్మాయికి మాత్రం ఉండదు? మీదీ అదే కోరికా? అయితే కాస్త సహజంగా... కాసిని మేకప్ మెరుపులతో మేనిని మెరిపించేందుకు సిద్ధంకండిలా... రెండు స్పూన్ల ముల్తానీ మట్టికి, కొన్ని చుక్కల రోజ్‌వాటర్, తగినంత పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖంపై వృత్తాకారంలో రుద్దాలి. ఇలా ఓ నిమిషం చేశాక చల్లని నీటితో కడిగేయాలి. ఇది...
బుగ్గల్లో కెంపులు విరబూస్తూ... పట్టుతో పోటీపడే జుట్టుమెరుపుతో పండగపూట సమ్‌థింగ్ స్పెషల్‌గా మెరిసిపోవాలని ఏ అమ్మాయికి మాత్రం ఉండదు? మీదీ అదే కోరికా? అయితే కాస్త సహజంగా... కాసిని మేకప్ మెరుపులతో మేనిని మెరిపించేందుకు సిద్ధంకండిలా...
జిడ్డు పోగొట్టేద్దాం: రెండు స్పూన్ల ముల్తానీ మట్టికి, కొన్ని చుక్కల రోజ్‌వాటర్, తగినంత పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖంపై వృత్తాకారంలో రుద్దాలి. ఇలా ఓ నిమిషం చేశాక చల్లని నీటితో కడిగేయాలి. ఇది ఆయిలీ స్కిన్ వారికి జిడ్డు తగ్గించడానికీ మిగతా వారికి డీటాక్సింగ్ గానూ పనిచేస్తుంది.
డల్స్కిన్ పోగొట్టుకోడానికి.. ఓట్ మీల్ మంచి పరిష్కారం. పావుకప్పు ఉడికిన ఓట్స్‌కి మూడు స్పూన్ల తేనె, కొద్దిగా బ్రౌన్ షుగర్, తగినన్ని పాలు కలపాలి. దీన్ని బాగా కలిపి ముఖానికి పట్టించాలి. ఆరాక తడుపుతూ ముఖాన్ని రుద్దాలి. ఇది మృతకణాలను తొలగించడమే కాకుండా రక్తప్రసరణను మెరుగుపరిచి కాంతినీ ఇస్తుంది.
పోషణకు.. అరటి, ఆపిల్, బొప్పాయి, నారింజలను ఒక్కో ముక్క చొప్పున తీసుకుని మెత్తగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి, అరగంట తర్వాత కడిగేస్తే సరి! బొప్పాయిలోని ఎంజైమ్‌లు కణాల పునరుద్ధరణకూ, అరటి చర్మ మృదుత్వానికీ సాయపడతాయి. ఆపిల్, నారింజలోని విటమిన్లు, మినరల్స్ పోషణనందిస్తే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి తేమనందిస్తాయి.
టోనింగ్‌కు.. పావు కప్పు వేడినీటిలో కొన్ని గ్రీన్‌టీ ఆకులను వేసిమూతపెట్టాలి. చల్లారాక దానికి రెండు చుక్కల లావెండర్ ఆయిల్, కొంచెం కలబంద గుజ్జునూ కలపాలి. తర్వాత ఆ నీటిని వడకట్టి ఓ స్ప్రే బాటిల్లోకి తీసుకోవాలి. దీన్ని ముఖంపై చల్లుకోవాలి. మిగిలిన దాన్ని ఫ్రిజ్‌లో ఉంచాలి. రోజూ రెండుసార్లు కడిగిన ముఖంపై స్ప్రే చేసుకోవాలి. ఇది చర్మరంధ్రాలను దగ్గర చేస్తుంది. తగిన పోషణనూ అందిస్తుంది.
మేనుకి ఆలివ్/ నువ్వుల నూనెను పట్టించి, సెనగపిండిలో కొంచెం పసుపు, పెరుగు, తగినన్ని పాలు పోసి పట్టించి, రుద్దుతూ స్నానం చేస్తే చాలు. శరీరం నునుపుగా మారుతుంది.
* ఒక స్పూను తేనెలో పావు స్పూను చక్కెరను కలిపి ఓ నిమిషం పెదాలకు సున్నితంగా రుద్ది, ఆపై కడిగేయాలి. గోరువెచ్చని బాదం నూనెలో గోళ్లను నిమిషం పాటు ఉంచి, ఆపై మృదువుగా మసాజ్ చేయాలి. తర్వాత తడి టవల్‌తో తుడిచేస్తే మెరిసే గోర్లు సొంతమవుతాయి.
ఎంత పైపై మెరుగులు దిద్దినా చర్మం ఆరోగ్యంగా లేకపోతే ఇట్టే తెలిసిపోతుంది. బయటి నుంచే కాకుండా లోపలి నుంచీ పోషణ ఉండాలి. నీరు, నిద్ర సరైన మోతాదులో అందించాలి. వీటితోపాటు ఆహారంలో పండ్లనూ చేర్చుకుంటే మేలు. ఇక అసలు రోజు మెరిసిపోవాలంటే కాస్త మేకప్ టచప్ ఇస్తే సరి.
జుట్టు కోసం.. అరకప్పు అలోవెరా గుజ్జుకు రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్, ఒక టేబుల్ స్పూను గ్లిజరిన్, ఒక గుడ్డు సొన కలపాలి. దీన్ని బాగా కలిపి మాడు నుంచి కురుల చివరి వరకు పట్టించాలి. ఆపై షవర్ క్యాప్ పెట్టాలి. అరగంట తర్వాత తక్కువ గాఢతగల షాంపూతో కడిగేయాలి. మొత్తని, మెరిసే జుట్టు మీ సొంతం.
మేకప్ ఎలా?
మాయిశ్చరైజర్ తప్పనిసరి. ఆపై ప్రైమర్‌ను రాయాలి. ఇది మేకప్ ఎక్కువసేపు ఉండేలా చూస్తుంది. తర్వాత ఫౌండేషన్‌ను రాయాలి. చేతులకంటే బ్లెండర్‌ను ఉపయోగించడం మేలు. కళ్ల కింద నల్ల వలయాలు, ముఖంపై మచ్చలూ ఉంటే కన్సీలర్ ఉపయోగించాలి. ఆపై బ్రష్‌తో సెట్టింగ్ పౌడర్ రాస్తే చాలు. ఫేస్‌మాస్క్ తప్పనిసరి కాబట్టి, ఐ మేకప్‌పై ఎక్కువ దృష్టిపెట్టాలి. కాటుక, ఐలైనర్ కచ్చితంగా నలుపే అవ్వాలి. కాస్త కనుకొసల వరకూ తీర్చిదిద్దితే కళ్లు పెద్దగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. తర్వాత చుట్టూ కాస్త కాంపాక్ట్ అద్దితే చెదురుతుందన్న భయం ఉండదు. ఎక్కువసేపు నిలవడానికి మ్యాటే కంటే షిమ్మర్ హైలైటర్‌ను ఎంచుకోవడం మంచిది. దీనికి గోల్డ్ ఐ షాడోను జతచేస్తే పండగ కళ రావడమే కాదు.. ఏ వస్త్రాలకైనా నప్పుతుంది. పెదాలకు లిప్‌బామ్ రాశాకే లిప్‌స్టిక్ వైపు వెళ్లాలి. లిప్‌లైనర్ రాశాక లిప్‌స్టిక్ వేయాలి. రెండూ ఒకేరంగులో ఉండేలా జాగ్రత్తపడాలి. లేత రంగును ఎంచుకుంటే లుక్ సహజంగా ఉంటుంది. చెమట పట్టే అవకాశం ఎక్కువ కాబట్టి, వాటర్‌ప్రూఫ్ ఉత్పత్తులను ఎంచుకోవడం ఉత్తమం. సంప్రదాయ వస్త్రాలకు మరీ చిన్న బొట్టుబిళ్లలు నప్పవు. మధ్యస్థం లేదా కాస్త పెద్దగా ఉండేలా చూసుకుంటే లుక్ బావుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- అతను తగినవాడేనా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!